141 MPs Suspended : 141 మంది ఎంపీల సస్పెన్షన్
దేశ చరిత్రలో మొదటిసారి
141 MPs Suspended : న్యూఢిల్లీ – భారత దేశ చరిత్రలో అత్యంత దుర్దినంగా డిసెంబర్ 19న భావించవచ్చు. లోక్ సభలో ఇవాళ ఏకంగా 141 మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ ఓం బిర్లా. లోక్ సభలో కర్ణాటకకు చెందిన బీజేపీ(BJP) ఎంపీ వెంట వచ్చిన కొందరు లోక్ సభలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు.
141 MPs Suspended from Lok Sabha
22 ఏళ్ల తర్వాత మరోసారి దాడి ఘటన చోటు చేసుకుంది. దీనిపై రాహుల్ గాంధీతో పాటు మరికొందరు నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా వివరణ ఇవ్వాల్సి ఉండగా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. దీనిపై చర్చించాలని పట్టు పట్టారు.
తాజాగా వేటుకు గురైన వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ , మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేతలు శశి థరూర్ , కార్తీ చిదంబరం , ఎన్సీపికి చెందిన ఎంపీ సుప్రియా సూలే ఉన్నారు. పార్లమెంట్ నుంచి ఒకే రోజు 79 మంది ఆప్ ఎంపీలను సస్పెండ్ చేయడంతో పాటు ఇవాళ మరో 49 మంది ఎంపీలపై వేటు వేయడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఇది ఒక రకంగా పార్లమెంట్ లో దుర్దినంగా పేర్కొన్నారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు స్పీకర్ ఓం బిర్లా.
Also Read : Kavya Maran : తళుక్కుమన్న కావ్య మారన్
