Mexico Gun Attack : మెక్సికోలో కాల్పుల మోత 18 మంది హ‌తం

కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న అమెరికా

Mexico Gun Attack : కాల్పుల మోత‌ల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది అమెరికా. ఇప్ప‌టికే చాలా చోట్ల కాల్పులు ఎక్క‌డో చోట చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ద‌క్షిణ మెక్సికోలో ఓ గ్యాంగ్ స్ట‌ర్స్ విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో న‌గ‌ర మేయ‌ర్ కొనార్డోతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘ‌ట‌న తీవ్ర క‌ల‌కలం రేపింది. శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి దృష్ట్యా పెద్ద ఎత్తున బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ప్ర‌భుత్వం ఆరా తీసింది. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం మెక్సికో లోని టెటెలెపాన్ సిటీ హాలులో గురువారం సాయుధులైన దుండ‌గులు విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.

అక్క‌డిక‌క్క‌డే 18 మంది మ‌ర‌ణించారు. మేయ‌ర్ కూడా ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోవ‌డం మ‌రింత ఆందోళ‌న‌కు దారి తీసింది. అస‌లు కాల్పుల మోత‌లు పెర‌గ‌డంతో ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ముందు జాగ్ర‌త్త‌గా మెక్సికో(Mexico Gun Attack) ప్ర‌భుత్వం జాగ్ర‌త్త ప‌డింది. సైన్యాన్ని మోహ‌రించాల‌ని ఆదేశించింది.

ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. అక్క‌డంతా విషాద వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఘ‌ట‌న త‌ర్వాత చాలా మంది షాక్ కు గుర‌య్యారు. మేయ‌ర్ మోన్డోజా తండ్రి మాజీ మేయ‌ర్ జాన్ అకోస్టాను దారుణంగా హ‌త మార్చిన‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు మెక్సికో సిటీలో కేవ‌లం 15 రోజుల వ్య‌వ‌ధిలో ఇలాంటి కాల్పుల ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ఇది మూడోసారి.

ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై అమెరికా బైడెన్ ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. గ‌న్ క‌ల్చ‌ర్ ప్ర‌స్తుతం అమెరికాను భ‌యాంద‌ళ‌ణ‌కు గురి చేస్తోంది. విచిత్రం ఏమిటంటే అక్క‌డి ప్ర‌జ‌ల కంటే ఆయుధాలు ఎక్కువ‌గా ఉండ‌డం.

Also Read : కిడ్నాపైన ఎన్నారై ఫ్యామిలీ దారుణ హ‌త్య

Leave A Reply

Your Email Id will not be published!