19 MPS Suspended : కొనసాగుతున్న సస్పెన్షన్ల పర్వం
నిన్న లోక్ సభ ఇవాళ రాజ్య సభ
19 MPS Suspended : పార్లమెంట్ ప్రజలకు సంబంధించి ఓ దేవాలయం లాంటిది. ప్రస్తుతం రాజకీయాలకు వేదికలుగా మారాయన్న ఆరోపణలున్నాయి.
ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు అక్కడ కొలువు తీరారో ఎన్నికైన వారికి తెలియాలి. రైతు నేత రాకేశ్ టికాయత్ అన్నట్టు ఈ దేశంలో కొలువు తీరింది బీజేపీ ప్రభుత్వం కానే కాదు అదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని.
లోక్ సభలో ప్రజలు నిత్యం వాడే వస్తువులపై పన్ను తగ్గించాలని కోరిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. తాజాగా సేమ్ సీన్ మంగళవారం రిపీట్ అయ్యింది.
రాజ్యసభలో ఏకంగా 19 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటు(19 MPS Suspended) పడింది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం గురించి ప్రధానంగా చర్చ జరపాలని విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.
కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. దీంతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
వారం రోజుల పాటు వారిని హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. వేటుకు గురైన వారిలో ఏడుగురు టీఎంసీ ఎంపీలు ఉండగా తెలంగాణకు చెందిన ముగ్గురు ఎంపీలు, ఐదు మంది డీఎంకేకు చెందిన ఎంపీలు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఉన్నారు.
ఇది పూర్తిగా అప్రజాస్వామికమని దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు ఆయా పార్టీల నేతలు ప్రకటించారు. తమ గొంతు నొక్కడమంటే ప్రజల గొంతు వినిపించకుండా చేయడమేనని ఆరోపించారు.
Also Read : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్ట్