Fighter Planes Collide : డల్లాస్ ఎయిర్ షోలో విమానాలు ఢీ
ఆరుగురు దుర్మరణం..తీవ్ర విషాదం
Fighter Planes Collide : అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్ లోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎయిర్ షోలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఒక బోయింగ్ బి-17 బాంబర్ , మరో చిన్న విమానం గాలిలో ఎగిరిన కొద్ది సేపటికే గతి తప్పాయి(Fighter Planes Collide). వెంటనే నేలపై పడి మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది మృతి చెంది ఉంటారని విశ్వసనీయ సమాచారం. ఈ ఎయిర్ షోకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ప్రతి ఏటా డల్లాస్ లో ఈ షో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బి-17 బాంబర్ ఫ్లైట్ , బెల్ పి-63 కింగ్ కోబ్రా(Fighter Planes Collide) ఎడమ వైపు నుండి దూసుకు వచ్చి రెండు వ్యతిరేక దశలో ఢీకొన్నాయి.
రెండవ ప్రపంచ యుద్దం నాటి విమానం పైనే కూలి పోయింది. వెంటనే రెండు విమానాలు ముక్కలై ధ్వంసమయ్యాయి. కొన్ని సెకన్లలో విమానాలు కళ్ల ముందే కుప్ప కూలాయి. డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ పోర్ట్ లో వింగ్స్ ఓవర్ డల్లాస్ ఎయిర్ షో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) దాని ఏజెంట్లు , నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఈ సంఘటనపై విచారణ జరుపుతుందని తెలిపింది. ఈ ఘటనపై డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ స్పందించారు. ఘటన జరగడం బాధాకరమని, వివరాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
బి-17 నాలుగు ఇంజిన్ల బాంబర్ రెండవ వరల్డ్ వార్ లో జర్మనీతో జరిగిన వైమానిక యుద్దంలో సక్సెస్ అయ్యింది.
Also Read : భారత్ యుకె మధ్య బంధం పటిష్టం – జాన్సన్