Jyotiraditya Scindia : వ‌చ్చే 5 ఏళ్ల‌లో 200 ఎయిర్ పోర్ట్ లు

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా

Jyotiraditya Scindia : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఐదు సంవ‌త్స‌రాల కాలంలో ఏకంగా విమాన‌యాన రంగంలో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్నాయ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప‌లు చోట్ల కొత్తగా ఎయిర్ పోర్టులు నిర్మించ‌డం జ‌రిగింద‌న్నారు. తాజాగా సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టారు. మ‌రో 200 విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

బుధ‌వారం జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాల కాలంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ విమాన‌యాన రంగంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింద‌ని చెప్పారు. భారీ ఎత్తున మార్పులకు తీకారం చుట్టామ‌ని అన్నారు.

భార‌త దేశ వ్యాప్తంగా కొత్త‌గా హెలి పోర్ట్ లు , వాట‌ర్ ఏరో డ్రోమ్ లు కూడా అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు జ్యోతిరాదిత్యా సింధియా. గ‌తంలో ఈ రంగం తీవ్ర నిరాద‌ర‌ణ‌కు లోనైంద‌న్నారు. కానీ మోదీ ముందు చూపుతో ఎయిర్ పోర్ట్ ల‌ను అభివృద్దికి అనుసంధానంగా చూశార‌ని అందుకే ప్ర‌యారిటీ ఇస్తున్నార‌ని తెలిపారు.

గ‌త 68 ఏళ్ల‌లో 74 ఎయిర్ పోర్టులు ఉంటే మోదీ బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ హ‌యాంలో ఆ సంఖ్య 148కి చేరింద‌న్నారు. భ‌ద్ర‌త‌, సౌక‌ర్యాలు, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు జ్యోతిరాదిత్యా సింధియా.

Also Read : IND vs AUS WTC Final : ప‌రుగుల వేట‌లో ఆసిస్

 

Leave A Reply

Your Email Id will not be published!