21 China Fighter Jets : తైవాన్ లోకి చైనా ఫైటర్ జెట్ లు ఎంట్రీ
అమెరికా స్పీకర్ పర్యటన ఫలితం
21 China Fighter Jets : ఓ వైపు ఉక్రెయిన్ పై ఇంకా యుద్దం ముగించలేదు రష్యా. ఇంత లోపే మరో యుద్ధం వచ్చేలా కనిపిస్తోంది. కావాలని కయ్యానికి కాలు దువ్వుతున్నాయి చైనా, అమెరికాలు.
తైవాన్ విషయంలో తటస్థ వైఖరి అవలంభించాలని , అది తమ భూభాగం అంటోంది మొదటి నుంచీ చైనా. కానీ తైవాన్ మాత్రం చైనా చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటోంది.
ఆ దేశం చిన్నదే అయినా డ్రాగన్ తో యుద్దానికి సై అంటోంది. కాగా అమెరికా తైవాన్ కు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తోంది. ఇదే సమయంలో అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తీవ్ర ఉద్రిక్తతలు, హెచ్చరికల మధ్య తైవాన్ లో పర్యటించారు అధికారికంగా.
ఆమె గనుక కాలు మోపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే వార్నింగ్ ఇచ్చి చైనా అమెరికాకు. కానీ యుఎస్ ఆ వార్నింగ్ ను బేఖాతర్ చేస్తూ ముందుకే వెళ్లింది.
దీంతో ముందే ప్రకటించిన విధంగా చైనా దూకుడు పెంచింది. ఏకంగా 21 చైనా ఫైటర్ జెట్ లు తైవాన్ (21 China Fighter Jets) ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి ప్రవేశించాయి. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది ప్రపంచ వ్యాప్తంగా.
తైవాన్ జల సంధిలో సైనిక విన్యాసాలను ప్రారంభిస్తామని ప్రకటించింది చైనా. ఫైటర్ జెట్ లు ప్రవేశించిన విషయాన్ని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో వెల్లడించింది.
అధికారికంగా ధ్రువీకరించింది కూడా. దీంతో ఇరు దేశాల మధ్య తైవాన్ ఇప్పుడు కీలకంగా మారింది. మరో వైపు తైవాన్ అమెరికా స్పీకర్ నాన్సీ కి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
Also Read : అల్ ఖైదా చీఫ్ రేసులో సైఫ్ అల్ అడెల్