Covid19 : దేశంలో కొత్తగా 2,112 కరోనా కేసులు
కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవర్
Covid19 : దేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా కరోనా కేసులు 2,112 నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇన్ఫెక్షన్ లలో యాక్టివ్ కేసులు 0.05 శాతం ఉండగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.76 శాతానికి పెరిగిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ మేరకు శనివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 219.53 కోట్ల డోస్ ల కోవిడ్ వ్యాక్సిన్లను అందించినట్లు తెలిపింది. తాజాగా కొత్త కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల(Covid19) సంఖ్య 4,46,40,748కి పెరిగాయి. కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 24,043కి తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా స్పష్టం చేసింది.
ఇక తాజాగా చోటు చేసుకున్న నాలుగు మరణాలతో కలుపుకుంటే మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 5,28,057కి చేరుకుంది. ఇందులో కేరళలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్ లో 24 గంటలలో ఒకరు మరణించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక రోజూ వారీ సానుకూలత రేటు 1.01 శాతంగా నమోదైంది.
వారం వారీ సానుకూలత రేటు 0.97 శాతంగా నమోదైంది. కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,40,87,748కి చేరుకోగా మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. మరో వైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 219.53 కోట్ల వ్యాక్సిన్లు అందించబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దేశాలకు భారత్ వ్యాక్సిన్లను సరఫరా చేసింది ఉచితంగానే.
Also Read : విండీస్ నిష్క్రమణపై పోస్టుమార్టం