Agnipath Protests Arrest : సికింద్రాబాద్ ఘటనలో 22 మంది అరెస్ట్
సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులే ఎక్కువ
Agnipath Protests Arrest : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిపథ్ స్కీం(Agnipath Protests Arrest) నిరసనలో రైల్వే పోలీసులు అసలు వాస్తవాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి ఈ అల్లర్ల ఘటన వెనుక ఉన్న 22 మందిని అరెస్ట్ చేశారు.
ఏపీలోని నరసారావు పేట నుంచి వచ్చిన అభ్యర్థులే దాడికి పాల్పడినట్లు తెలిపారు. సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొనట్లు గుర్తించారు.
గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్ , వరంగల్ , నిజామాబాద్ , మహబూబ్ నగర్ అభ్యర్థులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రైలులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉండగా అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఆవుల సుబ్బారావు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్నారు పోలీసులు. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన దేశాన్ని విస్తు పోయేలా చేసింది. రైల్వే స్టేషన్ పూర్తిగా రణ రంగంగా మారింది.
ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రాళ్లు రువ్వారు. విధ్వంసం సృష్టించారు.
అయితే తెలంగాణ కు చెందిన విద్యార్థులు మాత్రం తాము శాంతియుతంగా నిరసన తెలియ చేయాలని అనుకున్నామని కానీ ఊహించని రీతిలో విధ్వంసానికి పాల్పడ్డారంటూ వాపోయారు.
ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకున్న అల్లర్ల వెనుక ఆంధ్రాకు చెందిన మూలాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తంగా తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
ఆవుల సుబ్బారావు నర్సారావుపేట నుంచి హైదరాబాద్ కు వచ్చి ప్రేరేపించేలా చేశాడంటూ పోలీసులు ఆరోపించారు.
Also Read : అగ్నిపథ్’ అగ్నిగుండం ఆగని విధ్వంసం