Twitter Shock : ట్విట్టర్ లో 25 శాతం ఉద్యోగాలకు కోత
ప్లాన్ చేస్తున్న టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్
Twitter Shock : తనకు అడ్డంకిగా ఉన్న ప్రతి ఒక్కరిని తొలగించే పనిలో పడ్డారు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్. తాజాగా రూ. 4,400 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్న మస్క్ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను(Twitter Shock) చేజిక్కించుకున్నాడు. ఇంక టాప్ లెవల్లో ఉన్న వారందరికీ చెక్ పెట్టాడు. ఆపై తనకు ఎవరు ఎదురు చెప్పినా వాళ్లను ముందుగా బయటకు పంపించే పనిలో బిజిగా ఉన్నాడు.
ఇప్పటికే సిఇఓ పరాగ్ అగర్వాల్ , సిఎఫ్ఓ సెగల్, లీగల్ హెడ్ విజయా గద్దెలను తొలగించాడు ఎలాన్ మస్క్. ఆయనకు ముందు నుంచి ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ అంటే విపరీతమైన కోపం. వచ్చీ రావడంతోనే వారిని గెంటేశాడు. కానీ మిగతా లెవల్లో ఉన్న వారిని కూడా సాగనంపేందుకు డిసైడ్ అయ్యాడు.
ఎప్పుడైతే ట్విట్టర్ తన వశమైందో ఆనాటి నుంచే చకా చకా పనులను చక్కదిద్దుతూనే ఇంకో వైపు జాబర్స్ ఎక్కువగా లేకుండా ఉండే ప్లాన్ చేస్తున్నాడు ఎలాన్ మస్క్. ఇదే క్రమంలో తన స్వంత సంస్థ టెస్లా కంపెనీలో కూడా ఇటీవల ఉద్యోగాల కోత విధించాడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది.
దీనిపై క్లారిటి ఇచ్చాడు ఎలాన్ మస్క్. ఎంత కాలమని తెల్ల ఏనుగులను భరిస్తూ వస్తానని ప్రశ్నించాడు. తాజాగా మరో బాంబు పేల్చాడు. 1వ రౌండ్ లో ఉద్యోగ కోతల్లో 25 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించారు ఎలాన్ మస్క్.
ఈ విషయాన్ని అమెరికా మీడియా కోడై కూస్తోంది. పైకి లేదని బుకాయించినా చివరకు తాను అనుకున్నది చేయందే నిద్ర పట్టదు మస్క్ కు. ఎలాన్ పై భగ్గుమంటున్నారు ట్విట్టర్ ఎంప్లాయిస్.
Also Read : గౌతమ్ అదానీ భారీగా పెట్టుబడులు