3 Terrorists killed : జమ్మూలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
భద్రతా దళాల కాల్పుల్లో ఘటన
3 Terrorists killed : జమ్మూ, కాశ్మీర్ లో తుపాకుల మోత మోగుతూనే ఉంది. బుధవారం ఉదయం 7.30 గంటలకు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు(3 Terrorists killed). జమ్మూ లోని సిధ్రా ప్రాంతంలో హోరా హోరీగా పోరు కొనసాగుతోంది. దీంతో భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి.
పంజ్ తీర్థి – సిధ్ర రహదారిపై ముగ్గురు ఉగ్రవాదులు రెచ్చి పోయాయి. దీంతో హుటా హుటిన బలగాలు అక్కడికి చేరుకున్నాయి. గ్రెనేడ్ పేలుడు సంభవించింది. ఉరీలో ఏకే 74 రైఫిళ్లు, 12 చైనా పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారి పోయాడని జమ్మూ కాశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ వెల్లడించారు.
ట్రమ్ము వెళుతుండగా తాము అనుసరించామని చెప్పారు. జమ్మూ లోని సిధ్రా వద్ద ట్రక్కును ఆపారని, తాము వెంబడిస్తున్న విషయాన్ని గమనించిన ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి జంప్ అయ్యాడని తెలిపారు. ట్రక్కులో ఎవరైనా ఉన్నారని తాము తనిఖీ చేస్తుండగా ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారని వెల్లడించారు డీఐజీ.
దీంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయని వెల్లడించారు. ఐదు నుండి ఆరు గ్రెనేడ్ పేలుళ్లు జరిగినట్లు సమాచారం. దీంతో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో నివాసులు భయాందోళనకు లోనయ్యారు. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో 15 కిలోల బరువు కలిగిన ఐఈడీ పరికరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీనిని నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్ , మరో లెటర్ ప్యాడ్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు.
Also Read : సరిహద్దు వివాదం ‘మరాఠా’ తీర్మానం