Thailand Shooting : గన్ మ్యాన్ కాల్పుల మోత..కాల్చివేత
థాయ్ లాండ్ లో మారణ హోమం
Thailand Shooting : ప్రపంచ వ్యాప్తంగా విస్తు పోయేలా చేసిన కాల్పుల ఘటన థాయ్ లాండ్(Thailand Shooting) లో చోటు చేసుకుంది. థాయ్ లాండ్ డే కేర్ షూటింగ్ లో 34 మంది మరణించారు. సాయుధుడైన అగంతకుడు కాల్చి చంపబడ్డాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని కూడా కాల్చి వేశాడు. తనను తాను చంపు కోవడం గమనార్హం.
అనుమానాస్పద గన్ మ్యాన్ బాధితుల్లో 22 మంది చిన్నారులు ఉన్నారని , మాదక ద్రవ్యాలకు సంబంధించిన కారణాలతో వారిని సేవ నుండి డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ పోలీసు , తన భార్య , బిడ్డను కాల్చి చంపడానికి ముందు 34 మందిని పొట్టన పెట్టుకున్నాడు.
డేకేర్ సెంటర్ లో జరిగిన సామూహిక కాల్పుల బాధితుల్లో 2 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా ఉన్నారని స్థానిక పోలీసు అధికారి వెల్లడించారు. కాల్పులు జరిపిన సమయంలో 22 మంది చిన్నారులు ఉన్నారు. భోజన సమయంలో గన్ మ్యాన్ వచ్చినప్పుడు దాదాపు 30 మంది పిల్లలు సెంటర్ లో ఉన్నారని ఉన్నత అధికారి జిడపా బూన్స మ్ రాయిటర్స్ తో చెప్పారు.
నా క్లాంగ్ పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ చక్ర్ ఫట్ విచిత్వైద్య కూడా థాయ్ రాత టీవీతో మాట్లాడారు. గన్ మ్యాన్ గత సంవత్సరం పోలీస్ ఫోర్స్ నుండి డిశ్చార్జ్ అయ్యాడని తెలిపారు. ఎనిమిది నెలల గర్భిణీ అయిన టీచర్ తో సహా నలుగురు లేదా ఐదుగురు సిబ్బందిని గన్ మ్యాన్ కాల్చి చంపాడని పేర్కొన్నారు.
థాయ్ లాండ్ లో సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు. ఈ ప్రాంతంలో నేరాల రేటు చాలా తక్కువ.
Also Read : సరిహద్దుల వలస విధానంపై ఆందోళన