Nitish Kumar : పోలీసు శాఖలో మహిళలకు 35 శాతం – సీఎం
నితీష్ కుమార్ కీలక ప్రకటన
Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా రాష్ట్ర పోలీసు శాఖలో మహిళకు అవకాశం కల్పించేందుకు 35 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. మొత్తం నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అన్నారు.
ప్రస్తుతానికి పోలీస్ శాఖలో 1.5 లక్షల రిక్రూట్ మెంట్ లే లక్ష్యంగా తాము పెట్టుకున్నట్లు వెల్లడించారు నితీశ్ కుమార్(Nitish Kumar). ఇప్పటి వరకు 1.08 లక్షల నియామకాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. బుధవారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా బీహార్ పోలీసుల్లో మహిళల ప్రాతినిధ్యం 27 నుంచి 28 శాతం మాత్రమే ఉందని తెలిపారు.
రాష్ట్ర పోలీసు దళంలో మహిళల సంఖ్య పెరగడం వల్ల మహిళలకు సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటి నుంచి నియమించబోయే ప్రతి రిక్రూట్ మెంట్ లో 35 శాతానికి పెంచడం ప్రస్తుతం అవసరమన్నారు నితీశ్ కుమార్.
ఇదిలా ఉండగా బీహార్ పోలీస్ శాఖలో కొత్తగా నియమించబడిన 10,459 మందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు సీఎం. రాష్ట్రంలోని ప్రతి లక్ష జనాభాకు 160 నుంచి 170 మంది పోలీసులను మోహరించే దిశగా వేగంగా పని చేయాలని హొం శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు నితీశ్ కుమార్(Nitish Kumar).
రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 115 మంది పోలీసులను నియమించాలని గతంలో నిర్ణయించామన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ నిష్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి లక్ష జనాభాకు 160 మంది 170 మంది పోలీసు సిబ్బంది ఉండాలని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
Also Read : పెన్ మేకర్ రొటోమాక్ రూ. 750 కోట్ల స్కాం