TTD : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిర్వహించ లేదు ఉత్సవాలను. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది 2022లో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టింది.
ఊహించని రీతిలో ప్రతి రోజూ ఉత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు స్వామి వారి దర్శనం కోసం. రోజుకు 80 వేల మందికి పైగా స్వామి వారిని దర్శించుకుంటున్నట్లు అంచనా. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. మరో వైపు దర్శనం కోసం క్యూలైన్లు కొనసాగుతున్నాయి.
పిల్లలు, తల్లులు ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. శ్రీవారి సేవకులు సేవలో మునిగి పోయారు. ముందు జాగ్రత్తగా టీటీడీ సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడం లేద. పెరటాసి మాసం, మూడో శనివారం రావడం, వరుస సెలవులు కావడంతో భక్తుల రాక మొదలైంది.
ఇంకా కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నది. స్వామి వారి దర్శన భాగ్యం కలగాలంటే కనీసం 48 గంటల సమయం పడుతుందని సమాచారం. భక్తుల కోసం ఏర్పాటు చేసిన కంపార్ట్ మెంట్లన్నీ పూర్తిగా నిండి పోయాయి. శుక్రవారం ఒక్క రోజే 70 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
భక్తుల నుండి వచ్చిన స్వామి వారి హుండి ఆదాయం రూ. 4 కోట్లకు పైగానే ఉందని టీటీడీ తెలిపింది. మరో వైపు బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక తిరిగి సిఫార్సు లేఖలు జారీ చేసే చాన్స్ ఉంది.
Also Read : త్వరలో నైపుణ్య శిక్షణ కేంద్రం స్టార్ట్