50 Hours MPs Protest : ఎంపీల 50 గంటల నిరవధిక నిరసన
కేంద్ర సర్కార్ పై కొనసాగుతున్న ఆందోళన
50 Hours MPs Protest : తమను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ ఎంపీలు 50 గంటల నిరవధిక నిరసనకు(50 Hours MPs Protest) దిగారు. కేంద్ర సర్కార్ కావాలని విపక్షాలను టార్గెట్ చేసిందంటూ ఆరోపించారు. ధరల పెరుగుదలపై చర్చకు డిమాండ్ చేస్తున్నారు.
జూలై 27 రాత్రి పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల బహిరంగ ప్రదేశంలోనే గడిపారు వారంతా. గురువారం ఉదయం ఎంపీలు తమ ఫోన్లను చెక్ చేసుకునే పనిలో పడ్డారు.
సోమ, మంగళవారాల్లో సస్పెండ్ అయిన 20 మంది ఎంపీల్లో టీఎంసీకి చెందిన ఏడుగురు, డీఎంకేకు చెందిన ఆరుగురు, టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరు, సీపీఐ, ఆప్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ కాగా రాజ్య సభ నుంచి ఎక్కువగా సస్పెండ్ అయ్యారు ఎంపీలు. ఇదిలా ఉండగా నిరసన తెలిపేందుకు ఎంపీలు తమకు టెంట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
దీనికి ఎలాంటి పర్మిషన్ లేదంటూ తిరస్కరించారు పోలీసులు. కాగా పార్లమెంటరీ లైబ్రరీలోని టాయిలెట్లను వినియోగించు కునేందుకు ఎంపీలకు పర్మిషన్ లభించింది.
ఇక టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ నిద్రిస్తున్న ఫోటోను షేర్ చేశారు. మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు ఎలా నిద్ర పోతారంటూ ఆయన ప్రశ్నించారు.
ఇవాళ ఎంపీలకు సంబంధించిన భోజనానికి టీఆర్ఎస్, ఆప్ ఏర్పాట్లు చేసింది. మొత్తంగా 50 గంటల నిరసన దీక్ష తీవ్ర చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఎంపీలు ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే హక్కును కూడా హరించి వేస్తారా అంటూ ప్రశ్నించారు.
Also Read : పార్టీకి..ప్రభుత్వానికి మాయని మచ్చ – టీఎంసీ