Elon Musk Shock : ఎలాన్ మస్క్ షాక్ ఉద్యోగులకు ఝలక్
ఇమెయిల్ ద్వారా అందరికీ సమాచారం
Elon Musk Shock : ట్విట్టర్ ఉద్యోగులకు కోలుకోలేని దెబ్బ. బయటకు కేవలం 3,798 మందిని మాత్రమే తొలగిస్తున్నట్టు ప్రకటించినా తాజా సమాచారం మేరకు సంస్థలో పని చేస్తున్న వారిలో 50 శాతం మంది ఎంప్లాయిస్ పై వేటు వేసినట్లు టాక్. కొత్త వారిని ఎంపిక చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించారు ఎలాన్ మస్క్.
ముందు ట్విట్టర్ ను ప్రక్షాళన చేస్తానని, ఆ తర్వాత ఎవరు ఉండాలో ఎవరు ఉండ కూడదో తానే నిర్ణయం తసుకుంటానని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే టాప్ పోస్ట్ లలో ఉన్న వారందరినీ తొలగించారు. ఆపై ట్విటర్ సంస్థకు సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను పీకి పారేశాడు.
ఆపై తనే బాస్ తానే సర్వస్వమని ప్రకటించాడు. ఇక నుంచి తాను ఏది చెబితే చట్టం, అదే శాసనం అని ప్రకటించాడు ఎలాన్ మస్క్(Elon Musk Shock). ఆయా ఉద్యోగులకు సంబంధించిన ఇమెయిల్స్ యాక్సెస్ ను కూడా కట్ చేసినట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ అధికారికంగా వెల్లడించింది.
ఎవరైనా ఆఫీసుకు రావాలని దారిలో ఉంటే వెంటనే తిరిగి మీ మీ ఇళ్లకు వెళ్లి పోవాలని కోరాడు మస్క్. తాత్కాలికంగా ట్విట్టర్ ఆఫీసులను మూసి వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది సర్వత్రా.
తాను కొనుగోలు చేసిన రూ. 4,400 కోట్ల ను ఎలా రాబట్టు కోవాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. దాదాపు 4 వేల మందికి పైగా ఉద్యోగులకు మంగళం పాడినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
Also Read : ఎలాన్ మస్క్ పై జో బైడన్ కన్నెర్ర