Jodhpur Violence : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స్వస్థలమైన జోధ్ పూర్ లో ఈద్ సందర్బంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలువురికి గాయాలు అయ్యాయి.
ఈ ఘటనలో ఇరు వర్గాలకు సంబంధించి 52 మంది అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఉదయ్ మందిర్ , నగోరి గేట్ తో సహా జోధ్ పూర్(Jodhpur Violence )లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.
పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకు పాలనా యంత్రాంగం ఇంటర్నెట్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. కర్ఫ్యూ ఎత్తి వేసేంత వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.
ఈద్ సందర్భంగా ఏర్పాటు చేసే జెండాల ఏర్పాటు విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. అంతే కాకుండా హింసకు సంబంధించి 45 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇరు వర్గాలను అదుపు చేసేందుకు వెళ్లిన ఖాకీలపై దాడులకు దిగారు. పలువురు పోలీసులు గాయపడ్డారు. భారీ సంఖ్యలో గుమి గూడిన జనాలను చెదర గొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, లాఠీలు ప్రయోగించారు.
జోధ్ పూర్ లో మూడు రోజుల పరశురామ జయంతి ఉత్సవాలు జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం వెనుక భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థల పాత్ర ఉందంటూ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
వాళ్లు ఉద్దేశ పూర్వకంగా దీనికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం ఆరోపణలను బీజేపీ ఖండించింది.
Also Read : తల్లి ఆశీర్వాదం యోగి ఆనందం