Chandigarh Row : 60 కాదు 4 వీడియోలు మాత్ర‌మే – విర్క్

ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ అబ‌ద్ద‌మ‌న్న న‌వ్రీత్ సింగ్

Chandigarh Row : పంజాబ్ లోని చండీగ‌ఢ్ యూనివ‌ర్శిటీ హాస్ట‌ల్ వీడియోల వ్య‌వ‌హారం(Chandigarh Row) ఇంకా కొలిక్కి రాలేదు. గ‌త రెండు రోజులుగా క్యాంపస్ విద్యార్థుల ఆందోళ‌న‌లతో అట్టుడుకుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ నిందితురాలితో పాటు మ‌రో ఇద్ద‌రు పురుషులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ మొత్తం ఘ‌ట‌న‌కు సంబంధించి కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు పోలీసు ఉన్న‌తాధికారి న‌వ్రీత్ సింగ్ విర్క్.

స్టూడెంట్ ఫోన్ లో కేవ‌లం 4 వీడియోలు మాత్ర‌మే ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. న‌వ్రీత్ సింగ్ విర్క్ సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

హాస్ట‌ల్ కు సంబంధించిన బాత్రూమ్ ల‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండ‌గా వీడియోలు తీసిన‌ట్లు ఎలాంటి ఆధారాలు త‌మ‌కు ల‌భించ లేద‌న్నారు.

కేవ‌లం అస‌త్య ప్ర‌చారంతో విద్యార్థులు నిర‌స‌న‌ల‌కు దిగార‌ని తెలిపారు విర్క్. కాగా చీఫ్ పోలీస్ ఆఫీస‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను యూనివ‌ర్శిటీ విద్యార్థినులు అంగీక‌రించ‌లేదు.

ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితురాలు ఆ వీడియోల‌ను త‌న బాయ్ ఫ్రెండ్ కు పంపింద‌ని చెప్పారు విర్క్. నిర‌స‌న తెలిపిన విద్యార్థులు చెబుతున్న‌ట్లు యూనివ‌ర్శిటీలో కానీ దాని ప్రాంగ‌ణంలో కానీ , హాస్టల్ లో కానీ ఎక్క‌డా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు లేవ‌న్నారు.

అవ‌న్నీ పుకార్లు త‌ప్ప వాస్త‌వాలు కాద‌ని కొట్టి పారేశారు పోలీసు ఉన్నాధికారి నవ్రీత్ సింగ్ విర్క్. 60 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు స‌ర్క్యులేట్ అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇదంతా అబ‌ద్ద‌మ‌ని ఆమె కొట్టి పారేశారు.

డిలీట్ చేసిన వీడియోల‌ను తిరిగి పొందేందుకు ద‌ర్యాప్తు ప్రారంభించామ‌న్నారు. బాత్రూమ్ ల‌లో ఏమైనా సీసీ కెమెరాలు పెట్టారా అనే దానిపై కూడా చూస్తున్నామ‌న్నారు.

Also Read : వీడియోల‌ కేసులో ముగ్గురు అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!