Rythu Bandhu : రూ. 7411 కోట్లు రైతు బంధు జ‌మ

62.99 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి

Rythu Bandhu : రైతు బంధు ప‌థ‌కం కింద ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో రూ. 7411.52 కోట్లు జ‌మ చేసిన‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. మొత్తం అర్హులైన తెలంగాణ ప్రాంతానికి చెందిన 62 ల‌క్ష‌ల 99 వేల మందికి రైతు బంధు(Rythu Bandhu) కింద వారి వ్య‌క్తిగ‌త ఖాతాల్లోకి జ‌మ చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇందుకు సంబంధించి కోటి 48 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు రైతు బంధు అందించ‌డం జ‌రిగింద‌ని తెలిపింది ప్ర‌భుత్వం. ఈ యాసంగి సీజ‌న్ లో కోటి 52 ల‌క్ష‌ల 91 వేల ఎక‌రాల ప‌ట్టా భూమి క‌లిగిన 66. 61 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 7 వేల 645. 66 కోట్లు రైతు బంధు సాయం అందాల్సి ఉంద‌ని పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా రైతు బంధు ప‌థ‌కం గ‌త ఏడాది 2021 డిసెంబ‌ర్ నుంచి ప్రారంభైంద‌ని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్. గ‌త నెల 28 నుంచి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

ఇదిలా ఉండ‌గా ఈనెల 20వ తేదీ వ‌ర‌కు రూ. 7 వేల 411 . 52 కోట్ల రూపాయ‌లు రైతుల ఖాతాల్లో జ‌మ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. మ‌రో 3 ల‌క్ష‌ల 62 వేల మంది రైతుల‌కు రూ. 234 కోట్ల 14 ల‌క్ష‌లు అందించాల్సి ఉంద‌ని తెలిపింది తెలంగాణ స‌ర్కార్.

కాగా రైతు బంధు కింద జిల్లాల వారీగా చూస్తే అత్య‌ధికంగా న‌ల్ల‌గొండ జిల్లా రైతుల‌కు రైతు బంధు(Rythu Bandhu) అందింది. ఈ జిల్లాలో 4 ల‌క్ష‌ల 69 వేల 696 మంది రైతుల‌కు రూ. 601. 74 కోట్లు జ‌మ చేసింది.

సంగారెడ్డి జిల్లాలో 3 లక్ష‌ల 18 వేల 988 మంది రైతుల‌కు రూ. 370 కోట్ల 74 ల‌క్ష‌లు జ‌మ చేసింది స‌ర్కార్. ఇక నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో 2 ల‌క్ష‌ల 77 వేల 920 మందికి రూ. 367. 25 కోట్లు , ఖ‌మ్మం జిల్లాలో 3 ల‌క్ష‌ల 8 వేల 479 మందికి రూ. 356.12 కోట్లు జ‌మ చేసిన‌ట్లు పేర్కొంది ప్ర‌భుత్వం.

రంగారెడ్డి జిల్లాలో 2 ల‌క్ష‌ల 94 వేల 972 మందికి రూ. 345 కోట్ల 33 ల‌క్ష‌లు, సిద్దిపేట జిల్లాలో 2 ల‌క్ష‌ల 94 వేల 362 మంది రైతుల‌కు రూ. 310. 65 కోట్లు రైతు బంధు కింద జ‌మ చేసిన‌ట్లు తెలిపింది.

Also Read : ఏపీ విత్త‌న సంస్థ‌కు జాతీయ పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!