70 Rooms Booked : రెబ‌ల్స్ కు 70 రూమ్ లు రోజుకు రూ. 8 ల‌క్ష‌లు

శివ‌సేన ఎమ్మెల్యేల ఏడు రోజుల ఖ‌ర్చు రూ. 56 ల‌క్ష‌లు

70 Rooms Booked : మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకున్న సంక్షోభం మొత్తం ఇప్పుడు అస్సాం లోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ హోట‌ల్ పై నెల‌కొంది. ఎందుకంటే మ‌హా వికాస్ అఘాడీలో శివ‌సేన పార్టీకి చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో రెబ‌ల్ ఎమ్మెల్యేలు కొన్ని రోజుల కింద‌ట గుజ‌రాత్ లోని సూర‌త్ లో ఉన్నారు.

తాజాగా అస్సాంలోని గౌహ‌తికి మ‌కాం మార్చారు. ప్ర‌స్తుతం వీరంతా ఫైవ్ స్టార్ హోట‌ల్ లో బ‌స చేశారు. వీరి రోజు ఖ‌ర్చు చూస్తే నోళ్లు వెళ్ల‌బెట్టాల్సిందే.

ఏకంగా రోజుకు రూ. 8 లక్ష‌లు, వారానికి బుక్ చేసిన‌ట్లు స‌మాచారం. అంటే మొత్తం ఖ‌ర్చు రూ. 56 ల‌క్ష‌లు. రూమ్ రెంట్ తో పాటు ఆహారం, ఇత‌ర సేవ‌లకు దాదాపు రూ. 8 ల‌క్ష‌ల కంటే ఎక్కువ అవుతుంద‌ని అంచ‌నా.

ఇదిలా ఉండ‌గా కార్పొరేట్ డీల్స్ పై బుక్ చేసిన వాటిని మిన‌హాయించి కొత్త బుకింగ్(70 Rooms Booked)  ల కోసం హోట‌ల్ యాజ‌మాన్యం అంగీక‌రించ‌డం లేదు. విందు వినోదాలు మూసి వేశారు.

హోట‌ల్ లో బ‌స చేసే వారికి మిన‌హా రెస్టారెంట్ కూడా మూసి వేశారు. ప్ర‌స్తుతం హోట‌ల్ కీల‌కంగా మారింది. దేశం యావ‌త్తు దానిపైనే ఫోక‌స్ పెడింది.

ఇందులో ఆప‌రేష‌న్ ఖ‌ర్చులో ఛార్ట‌ర్ ఫ్లైట్ లు , ఇత‌ర ర‌వాణా ఏర్పాట్ల ఖ‌ర్చు వేరేగా ఉంటాయి. దీనికి వెనుక ఇంకా తెలియ‌ని ఖ‌ర్చు లు కూడా ఉన్నాయి.

వీట‌న్నింటికి సంబంధించి వివ‌రాలు బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌డం ఖ‌ష్టం. ఇక రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఏక్ నాథ్ షిండే భార‌తీయ జ‌న‌తా పార్టీతో జ‌త క‌ట్టాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : శివ సైనికులు రోడ్ల‌పైకి వ‌స్తే క‌ష్టం – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!