Stephen Ravindra : మంత్రి హ‌త్య కుట్ర కేసులో 8 మంది అరెస్ట్

హైద‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర

Stephen Ravindra : రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ (Stephen Ravindra)హ‌త్య కుట్రను భ‌గ్నం చేశారు పోలీసులు.

ఈ ఘ‌ట‌నపై కీల‌క స‌మాచారాన్ని వెల్ల‌డించారు హైద‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌. గ‌త నెల ఫిబ్ర‌వ‌రి 23న ఫ‌రూక్, హైద‌ర్ అలీ సుచిత్ర వ‌ద్ద ఓ లాడ్జిలో ఉన్నారు.

25న బ‌య‌ట‌కు టీ తాగేందుకు వెళ్లిన స‌మ‌యంలో నాగ‌ర‌జాఉ, కొంద‌రు వ్య‌క్తులు క‌త్తుల‌తో వీరిని వెంబ‌డించి చంపేందుకు య‌త్నించారు.

అనంత‌రం ఫ‌రూక్ , హైద‌ర్ అలీ త‌ప్పించుకున్నారు.

5 గంటల త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పేట బ‌షీర్ బాద్ పోలీసులు సెక్ష‌న్ 307, 120బీ, 115, రెడ్ విత్ 34 ఐపీసీ, సెక్ష‌న్ 25 ఏబీ ఆర్మ్స్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశామ‌న్నారు.

విచార‌ణ‌లో యాద‌య్య‌, నాగ‌రాజు, విశ్వనాథ్ అనే ముగ్గురు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి కొంపల్లి ఏరియా లోని సుచిత్ర‌లో వ‌రిని వెంబ‌డించి దాడికి చేసేందుకు య‌త్నించారు. ఇద్ద‌రు త‌ప్పించుక‌న్నాక కొన్ని లాడ్జీల‌లో వెతికారు.

వీరిని 26న అరెస్ట్ చేశామ‌ని చెప్పారు స్టీఫెన్ ర‌వీంద్ర‌. 27న జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచామ‌న్నారు.

నాగ‌రాజు కొన్ని విష‌యాలు చెప్పాడ‌ని రాఘవేంద్ర రాజు కొంద‌రితో క‌లిసి హ‌త్య‌కు కుట్ర ప‌న్నార‌ని చెప్పాడ‌న్నారు.

రాఘ‌వేంద‌ర్ రాజు, మున్నూరు ర‌వి, మ‌ధుసూద‌న్ రాజు ఢిల్లీలో ఉన్న‌ట్లు తేలింద‌న్నారు.

వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి సర్వెంట్ క్వార్ట‌ర్ లో ఉన్న‌ట్లు గుర్తించామ‌ని వెల్ల‌డించారు స్టీఫెన్ ర‌వీంద్ర‌.

వారిని అరెస్ట్ చేసి హైద‌రాబాద్ కు తీసుకు వ‌చ్చామ‌న్నారు. రాఘ‌వేంద‌ర్ రాజు,

ర‌వి, మ‌ధుసూద‌న్ , అమ‌రేంద‌ర్ క‌లిసి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి వైజాగ్ వెళ్లి అక్క‌డి నుంచి ఢిల్లీ కి చేరుకుని ఆశ్ర‌యం పొందార‌ని తెలిపారు.

మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి డ్రైవ‌ర్, పీఏ రాజు అని విచార‌ణ‌లో తేలింద‌న్నారు.

కేసు విచార‌ణంలో భాగంగా ప‌లు ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

హ‌త్య కేసుకు ప్ర‌ధాన సూత్ర‌ధారులు మ‌ధుసూద‌న్, అమ‌రేందర్ రాజు అని తేలింద‌న్నారు.

హ‌త్య కోసం రూ. 15 కోట్లు సుపారి ఇవ్వ జూపార‌ని తెలిపారు

. కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి పాత్ర పై కూడా విచార‌ణ జ‌రుపుతున్నామ‌ని చెప్పారు స్టీఫెన్ ర‌వీంద్ర‌.

Also Read : ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం విద్యుత్ భారం

Leave A Reply

Your Email Id will not be published!