Arvind Kejriwal : 80 శాతం బ‌డులు యార్డుల కంటే అధ్వాన్నం

ప్ర‌ధాన మంత్రి మోదీకి అర‌వింద్ కేజ్రీవాల్ లేఖ

Arvind Kejriwal : ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి విద్యా వ్య‌వ‌స్థ గురించి, దాని బాగోగుల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

బుధ‌వారం ఢిల్లీ సీఎం సమ‌గ్ర‌మైన వివ‌రాల‌తో కూడిన లేఖ‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి రాశారు. 80 శాతానికి పైగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు జంక్ యార్డ్ ల కంటే అధ్వాన్నంగా ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దేశ వ్యాప్తంగా 14,500 పాఠ‌శాల‌ల అప్ గ్రేడ్ ల కోసం ప్ర‌ధాన మంత్రి స్కూల్స్ ఫ‌ర్ రైజింగ్ ఇండియా యోజ‌న‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. మొత్తం ఒక మిలియ‌న్ ప్ర‌భుత్వ బ‌డుల‌ను అప్ గ్రేడ్ చేసేందుకు ప్లాన్ రూపొందించాల‌ని కోరారు.

మీరు ప్ర‌క‌టించిన 14,500 పాఠ‌శాల‌ల ఆధునీక‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని అనుకుంటారు. మేము ఈ వేగంతో ప‌ని చేస్తే , ప్ర‌భుత్వ బ‌డుల‌న్నింటిని అప్ గ్రేడ్ చేసేందుకు 100 సంవ‌త్స‌రాలు ప‌డుతుంది.

దేశంలోని మొత్తం 10 ల‌క్ష‌ల పాఠ‌శాల‌ల పున‌రాభ‌వృద్ధికి ఒక ప్లాన్ సిద్దం చేయాల్సిందిగా నేను మిమ్మ‌ల్ని కోరుతున్నాన‌ని తెలిపారు అర‌వింద్ కేజ్రీవాల్. 2.7 మిలియ‌న్ల మంది విద్యార్థుల్లో 1.8 మిలియ‌న్లు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు.

80 శాతానికి పైగా బ‌డుల ప‌రిస్థితి చెత్తా చెదారం కంటే అధ్వాన్నంగా ఉన్నాయ‌ని వాపోయాడు. మ‌న పిల్ల‌ల‌కు కోట్లాది మందికి ఇలాంటి విద్య‌ను అంద‌జేస్తే భార‌త‌దేశం అభివృద్ది చెందిన దేశం ఎలా మారుతుంద‌ని ప్ర‌శ్నించారు.

1947లో ప్ర‌తి గ్రామం, ప‌ట్ట‌ణంలో మంచి ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను అభివృద్ది చేయ‌కుండా దేశం పెద్ద త‌ప్పు చేసింద‌న్నారు అర‌వింద్ కేజ్రీవాల్.

Also Read : ఎల్జీ నోటీసుల్ని చించేసిన ఆప్ ఎంపీ

Leave A Reply

Your Email Id will not be published!