North Korea Covid19 : ఉత్తర కొరియాను వణికిస్తున్న కరోనా
మూడు రోజుల్లో 8 లక్షలకు పైగా కేసులు
North Korea Covid19 : కరోనా మహమ్మారి ఉత్తర కొరియాను(North Korea Covid19) వణికిస్తోంది. గత మూడు రోజుల్లో ఏకంగా 8 లక్షల 20 వేల 620 కేసులు నమోదయ్యాయి. ఉత్తర కొరియా స్టేట్ మీడియా 42 మంది మరణించారని వెల్లడించింది.
3 లక్షల 24 వేల 550 మంది ప్రస్తుతం కరోనా దెబ్బకు చికిత్స పొందుతున్నారు. కరోనా కలకలం తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోందని పేర్కొన్నారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ . మొట్ట మొదటిసారిగా కోవిడ్ -19 కేసులను ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని, కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆదివారం ఒక్క రోజే 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
ఇది ఒకరకంగా ప్రభుత్వ పనితీరుకు సవాల్ గా మారిందన్నారు దేశాధ్యక్షుడు . దేశంలోని అన్ని ప్రావిన్సులు, నగరాలు, కౌంటీలు పూర్తిగా లాక్ డౌన్ లో ఉన్నాయి.
పని చేసే యూనిట్లు, ఉత్పత్తి యూనిట్లను కూడా పూర్తిగా మూసి వేసినట్లు ప్రెసిడెంట్ కిమ్ వెల్లడించారు. టీకాలు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని సూచించారు.
అయినా ఎక్కడా కేసులు తగ్గడం లేదు. రోజు రోజుకు పెద్ద సంఖ్యలో కరోనా కేసులు(North Korea Covid19) నమోదవుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.
రాజధాని ప్యోంగ్యాంగ్ లో ఓమిక్రాన్ వేరియంట్ కనుగొన్నట్లు ఉత్తర కొరియా ధ్రువీకరించింది. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా(North Korea Covid19) నాసిరకం ఆరోగ్య వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత చెత్తగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
కోవిడ్ వ్యాక్సిన్లు, యాంటీ వైరల్ ట్రీట్మెంట్ డ్రగ్స్ లేదా మాస్ టెస్టింగ్ పరికరాలు లేవు. బీజింగ్, సియోల్ నుంచి తక్షణ సాయం అందింది ఉత్తర కొరియాకు.
Also Read : దుండగుడి దుశ్చర్య 10 మంది కాల్చివేత