CRPF DG : జ‌మ్మూలో 83వ రైజింగ్ డే ప‌రేడ్

సీఆర్పీఎఫ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కుల్దీప్ సింగ్

CRPF DG : ఈనెల 18న జ‌మ్మూలోని ఎంఏ స్టేడియంలో 83వ రైజింగ్ డే చేప‌ట్ట‌నున్న‌ట్లు సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ కుల్దీప్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త ఏడాది మార్చి 1 నుంచి 175 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త మార్చ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. 183 మంది ఉగ్ర‌వాదుల‌ను ప‌ట్టుకున్నామ‌ని చెప్పారు.

తీవ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన 699 మందిని అరెస్ట్ చేసిన‌ట్లు తెలిపారు.ఢిల్లీ ఎన్సీఆర్(CRPF DG) వెలుపుల ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

ప్ర‌స్తుతం జ‌మ్మూ కాశ్మీర్ లో ప‌రిస్థితి బాగుంద‌న్నారు. మ‌రింత మెరుగు ప‌డుతుంద‌న్నారు కుల్దీప్ సింగ్ . దేశంలోని వివిధ ప్ర‌దేశాల‌లో వార్షిక డే క‌వాతులు నిర్వ‌హించాల‌ని, ప్ర‌జ‌ల‌కు త‌మ బలాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని కేంద్ర స‌ర్కార్ వివిధ ద‌ళాల‌ను ఆదేశించింది.

సిబ్బందితో పాటు పౌర జ‌నాభాకు, ప్ర‌ధానంగా యువ‌త‌కు ప్రేర‌ణ‌గా ప‌ని చేస్తుంద‌న్నారు. జాతీయ స‌మైక్య‌త‌కు ఇలాంటి ప‌రేడ్ లు దోహ‌ద ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు.

సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ – సీఆర్పీఎఫ్ దేశంలోని వివిధ వ‌ర్గాల‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. 32 మంది మ‌హిళా సిబ్బందిని వీఐపీ సెక్యూరిటీ వింగ్ లోకి మార్చామ‌న్నారు.

ఐదు రాష్ట్రాల‌లో ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో 41 మంది వీఐపీల‌కు తాము భ‌ద్ర‌త క‌ల్పించామ‌ని తెలిపారు. ఎన్నిక‌లు అయి పోగానే ఉప‌సంహ‌రంచుకున్న‌ట్లు వెల్ల‌డించారు కుల్దీప్ సింగ్(CRPF DG).

370 ఆర్టిక‌ల్ ర‌ద్దు త‌ర్వాత రాళ్ల దాడి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేద‌న్నారు. విదేశీ ఉగ్ర‌వాదుల చొర‌బాట్లు పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని తెలిపారు కుల్దీప్ సింగ్. దాడులు లాంటివి లేవ‌న్నారు.

Also Read : రాహుల్ ను క‌లిసిన‌ రెబ‌ల్ లీడ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!