Siddaramaiah : క‌ర్ణాట‌క హోం మంత్రి రాజీనామా చేయాలి

పీఎస్ఐ స్కాంపై సిద్ద‌రామ‌య్య కామెంట్స్

Siddaramaiah : పీసీఐ స్కాం కేసుకు సంబంధించి క‌ర్ణాట‌క హోం శాఖ మంత్రి అర‌గ జ్ఞానేంద్ర త‌క్ష‌ణ‌మే నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌(Siddaramaiah). మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో పోలీస్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ల నియామ‌కాల్లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించి పీఎస్ఐ స్కాం కేసు నమోదైంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖ‌ర్గే గ‌తంలో 545 మందికి పైగా అభ్య‌ర్థుల పీఎస్ఐ భ‌ర్తీలో భారీ కుంభకోణం జ‌రిగింద‌ని ఆరోపిస్తూ ప్ర‌భుత్వం, అధికారుల ప్ర‌మేయాన్ని ఎత్తి చూపారు.

ఇదిలా ఉండ‌గా పోలీస్ స‌బ్ ఇన్స్ పెక్ట‌ర్ల (పీఎస్ఐ) భ‌ర్తీ స్కామ్ లో ముఖ్య పాత్ర పోషించినందుకు ఐపీఎస్ ఆఫీస‌ర్ అమృత్ పాల్ ను అరెస్ట్ చేశారు.

ఈ త‌రుణంలో దీనిపై స్పందించారు క‌ర్ణాట‌క అసెంబ్లీలో ప్ర‌తిపక్ష నాయ‌కుడు, మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య(Siddaramaiah) నిప్పులు చెరిగారు. తాము ముందు నుంచి చెబుతూనే వ‌స్తున్నామ‌ని, ఇవాళ అరెస్ట్ తో అస‌లు మోసం ఎలా జ‌రిగింద‌నే దానిపై తేట తెల్ల‌మైంద‌న్నారు.

వెంట‌నే అర‌గ జ్ఞానేంద్ర త‌ప్పు కోవాల‌ని డిమాండ్ చేశారు. పాల్ పాత్ర‌కు సంబంధించి క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) సోమ‌వారం అదుపులోకి తీసుకుంది.

ఈ స్కామ్ కు ప్ర‌ధాన కార‌కుడు అర‌గ జ్ఞానేంద్రేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సిద్ద‌రామ‌య్య‌. వెంట‌నే మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఆయ‌న కోరారు.

స్కామే జ‌ర‌గ‌లేద‌ని చెప్పిన సీఎం బొమ్మై , హోం మంత్రి అర‌గ ఇప్పుడు ఏం చెబుతారంటూ ప్ర‌శ్నించారు సిద్ద‌రామ‌య్య‌.

Also Read : తేజ‌స్వీ సూర్య‌ను ప్ర‌శ్నించిన పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!