CJI NV Ramana : న్యాయ‌మూర్తుల‌పై సీజేఐకి లేఖాస్త్రం

నూపుర్ శ‌ర్మ కేసుకు సంబంధించి కామెంట్స్ పై గ‌రం

CJI NV Ramana :  ప్ర‌వ‌క్త మ‌హ‌మ్మ‌ద్ పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ బ‌హిష్కృత నాయకురాలు నూపుర్ శ‌ర్మ(Nupur Sharma) త‌న‌పై న‌మోదు చేసిన కేసుల‌ను ఢిల్లీ కోర్టు ప‌రిధిలోకి తీసుకోవాల‌ని కోరుతూ స‌ర్వోన్న‌త న్యాయ స్థానంను ఆశ్ర‌యించింది.

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు సూర్య‌కాంత్ , జేబీ పార్థివాలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా చీఫ్ జ‌స్టిస్(CJI NV Ramana) చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారితీశాయి.

ఆమెకు ఎలాంటి ముప్పు లేద‌ని కానీ నూపుర్ శ‌ర్మ వ‌ల్ల దేశానికి ప్రమాదం పొంచి ఉంద‌న్నారు. రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో టైట‌ర్ హ‌త్య‌కు ఆమె చేసిన కామెంట్సే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

అంతే కాదు ఈ భూమిపై గ‌డ్డి పెరిగేందుకు ఎంత హ‌క్కు ఉందో గాడిద‌కు కూడా తినే హ‌క్కు ఉంద‌న్నారు. ఆపై నోరు అదుపులో పెట్టుకోకుండా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయడం వ‌ల్ల దేశం అట్టుడుకి పోతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా చీఫ్ జ‌డ్జీల కామెంట్స్ పై దేశంలోని ప‌లువురు రిటైర్డ్ న్యాయ‌మూర్తులు , మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుదీర్ఘ లేఖ రాశారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల పాటి వెంక‌ట ర‌మ‌ణ‌కు.

ఈ మొత్తం లేఖ‌లో 15 మంది రిటైర్డ్ న్యాయ‌మూర్తులు, 77 మంది రిటైర్డ్ బ్యూరో క్రాట్లు , 25 మంది రిటైర్డ్ ఆర్మ్ డ్ ఫోర్స్ అధికారులు సంత‌కాలు చేశారు. ప్ర‌స్తుతం ఈ లేఖ క‌ల‌క‌లం రేపుతోంది.

ఇదిలా ఉండ‌గా న్యాయ మూర్తుల వ్యాఖ్య‌లు ధ‌ర్మానికి త‌గిన‌ట్టుగా లేవ‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Also Read : నూపుర్ శ‌ర్మ‌పై కోర్టు వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రం

 

Leave A Reply

Your Email Id will not be published!