Mumbai Heavy Rains : ముంచెత్తిన‌ వ‌ర్షం ముంబై అత‌లాకుత‌లం

3,500 మంది సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు

Mumbai Heavy Rains : భారీ వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తుండ‌డంతో దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై త‌ల్ల‌డిల్లుతోంది. వ‌ర్ష‌పు తాకిడికి జ‌న జీవ‌నం స్తంభించి పోయింది. ఎక్క‌డ చూసినా నీళ్లు. ప‌లు చోట్ల ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి.

70 శాతానికి పైగా ఎక్క‌డిక‌క్క‌డే ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. రోడ్డు ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించి పోయింది. వ‌ర్షాల తాకిడికి ప‌లు రైళ్ల‌ను నిలిపి వేశారు. సామ‌న్య జ‌నం ఆస‌రా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే రాబోయే మ‌రికొన్ని గంట‌ల్లో ముంబైని భారీ వ‌ర్షాలు(Mumbai Heavy Rains) కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో కొత్త‌గా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది.

మ‌రో వైపు లోత‌ట్టు ప్రాంతాల‌లోకి భారీగా నీళ్లు చేరుతుండ‌డంతో వంద‌లాది మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 3,500 మందిని త‌ర‌లించి వారికి భ‌ద్ర‌త క‌ల్పించారు.

ఇక ముందుస్తు హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్ ) బృందాలు రంగంలోకి దిగాయి.

ఇదిలా ఉండ‌గా ప‌లు చోట్లు వ‌ర్షాల దెబ్బ‌కు చిక్కుకు పోయిన ప్ర‌యాణికుల‌ను త‌ర‌లించేందుకు రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది.

ఏ ఒక్క‌రికి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఈ సంద‌ర్భంగా చెప్పారు మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే. ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలోని ఆరు జిల్లాల‌లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

Also Read : ముంబైని ముంచెత్తిన వ‌ర్షం

Leave A Reply

Your Email Id will not be published!