Kamala Harris : హింసోన్మాదం దేశానికి ప్రమాదం – కమలా హారీస్
అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు ఆవేదన
Kamala Harris : అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్(Kamala Harris) సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో రోజు రోజుకు పెరిగి పోతున్న హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోజు రోజుకు గన్ కల్చర్ పెరిగి పోతుండడం దేశానికి మంచిది కాదన్నారు.
శాంతితోనే సమాజం బాగు పడుతుందని, హింస ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదన్నారు. చికాగో లో అధ్యాపకులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో యుఎస్ వైఎస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ ప్రసంగించారు.
విద్య అన్నది జీవితంలో పైకి ఎదిగేందుకు దోహదం చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను నియంత్రించేందుకు కృషి చేస్తోందని చెప్పారు కమలా హారీస్.
ఇప్పటికే దేశంలో పెరిగి పోతున్న తుపాకులను నియంత్రించేందుకు చట్టాన్ని కూడా తీసుకు వచ్చామని చెప్పారు. కానీ విపక్షం మాత్రం అడ్డు చెప్పడం బాధాకరమన్నారు.
ఈ దేశంలో ప్రజల కంటే తుపాకులు ఎక్కువగా ఉన్నాయని ఇది సిగ్గు పడాల్సిన విషయం అన్నారు. ఏ ఒక్కరూ హింసను కోరుకోరని , మెరుగైన సమాజం కావాలంటే మనమంతా కలిసి కట్టుగా దీనిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రోజు రోజుకు గన్ కల్చర్ పెరుగుతుండడం మంచి పద్దతి కాదన్నారు. చిన్న పిల్లలు కూడా హింస పట్ల ఆకర్షితులు కావడం దారుణమన్నారు.
వారిని అటు వైపు వెళ్ల నీయకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని పేర్కొన్నారు వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్(Kamala Harris) .
ఇదిలా ఉండగా చికాగో సమీపంలో నిర్వహించిన పరేడ్ లో ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
Also Read : ప్రమాదంలో ప్రభుత్వం బ్రిటన్ లో సంక్షోభం