Eknath Shinde : ఉద్ద‌వ్ ఠాక్రేకు చెప్పినా ప‌ట్టించు కోలేదు – షిండే

మ‌హా వికాస్ అఘాడీ వ‌ల్ల ప్రయోజ‌నం లేదు

Eknath Shinde : మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ సీఎం , శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

శివ‌సేన‌, కాంగ్రెస్, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ తో ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌ని చాలా సార్లు తాను ఉద్ద‌వ్ ఠాక్రేకు చెప్పాన‌ని అన్నారు.

బుధ‌వారం జాతీయ మీడియాతో సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) మాట్లాడారు. చాలా సార్లు మంత్రిగా చ‌ర్చ‌లు జ‌రిపాన‌ని చెప్పారు. కానీ ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన పార్టీకి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌న్నారు.

కానీ రోజు రోజుకు కాంగ్రెస్ , ఎన్సీపీ పార్టీల‌తో చేర‌డం వ‌ల్ల మొద‌టికే మోసం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించినా ప‌ట్టంచు కోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

దీంతో తాను ధిక్కార స్వ‌రం వినిపించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. ఒక ర‌కంగా శివ‌సేన పార్టీకి ఉన్న ఇమేజ్ ను ఆయా పార్టీలు వాడుకున్నాయ‌ని కానీ తాము తీవ్రంగా న‌ష్ట పోవాల్సి వ‌చ్చింద‌న్నారు.

త‌మ‌దే అస‌లైన శివ‌సేన పార్టీ అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు సీఎం ఏక్ నాథ్ షిండే. తాము, భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డాన్ని శివ‌సేన నేత‌లు ప్ర‌శ్నిస్తున్నార‌ని మ‌రి శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ క‌లిసి పొత్తుగా ఏర్ప‌డి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది వ‌ర్తించ‌దా అని ప్ర‌శ్నించారు.

తాము ఇప్ప‌టికీ నిజ‌మైన బాలా సాహెబ్ ఠాక్రే వార‌సుల‌మ‌ని ప్ర‌క‌టించారు సీఎం.

Also Read : కేంద్రం నాట‌కం ఎన్నిక‌ల‌కు ఆటంకం – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!