NIA Udaipur Case : ఉద్దేశ పూర్వ‌కంగానే ప్ర‌చారం – ఎన్ఐఏ

ఉదయ్ పూర్ ద‌ర్జీ హ‌త్య కేసులో

NIA Udaipur Case : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్(NIA Udaipur Case) లో టైల‌ర్ (ద‌ర్జీ ) క‌న్హ‌య్య లాల్ దారుణ హ‌త్య‌. దుండ‌గులు దారుణంగా హ‌త్య చేశారు.

ఆపై వీడియోను సోషల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. అంతే కాదు ప్ర‌ధాన మంత్రి మోదీకి కూడా బెదిరింపులు చేశారు. హ‌త్య‌కు పాల్ప‌డిన వారిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌గా క‌స్ట‌డీకి అనుమ‌తిచ్చింది. ఈ త‌రుణంలో కేంద్ర హోం శాఖ మంత్రి ఈ కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్ప‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా కేసును ద‌ర్యాప్తు చేస్తున్న రాజస్థాన్ పోలీసులు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డైన‌ట్లు తెలిపారు. ఆ ఇద్ద‌రికీ పాకిస్తాన్ లోని క‌రాచీలో ఓ ఉగ్ర‌వాద సంస్థ‌తో లింకులు ఉన్నాయ‌ని, 2014లో ఒక‌రు అక్క‌డికి వెళ్లి వ‌చ్చార‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో 10 మందితో మాట్లాడిన‌ట్లు కూడా తేలింద‌న్నారు. ఈ త‌రుణంలో రంగంలోకి దిగిన కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ(NIA Udaipur Case) బుధ‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ద‌ర్జీ క‌న్హ‌య్య లాల్ తేలి హ‌త్య‌కు సంబంధించిన వీడియోను దుండ‌గులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశార‌ని స్ప‌ష్టం చేసింది. మ‌త ప్రాతిప‌దిక‌న శ‌త్రుత్వాన్ని ప్రోత్స‌హిస్తున్నార‌ని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్న‌ట్లు ఉద‌య్ పూర్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా హ‌త్య‌కు గురైన టైల‌ర్ కుమారుడు మాత్రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌మ తండ్రిని చంపిన వారికి రాచ మ‌ర్యాదులు ఎందుకు చేస్తున్నారంటూ ప్ర‌శ్నించాడు. వెంట‌నే ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని కోరాడు.

Also Read : గ్యాంగ్‌స్టర్ ల‌ది జాతీయ స‌మ‌స్య – భ‌గ‌వంత్ మాన్

Leave A Reply

Your Email Id will not be published!