KTR Safran CEO : ఏరో స్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్

వెల్ల‌డించిన ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి కేటీఆర్

KTR Safran CEO : దేశానికే త‌ల‌మానికంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డంలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజ‌లో ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ప‌లు కంపెనీల‌న్నీ హైద‌రాబాద్ లో కొలువు తీరాయి.

గ‌తంలో ఇండియా అంటే ఐటీ ప‌రంగా బెంగ‌ళూరు అని చెప్పే వారు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం కొలువు తీరాక సీన్ మారింది. పూర్తిగా ఇప్పుడు కేరాఫ్ హైద‌రాబాద్ అని చెప్పే స్థాయికి తీసుకు వ‌చ్చారు ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్.

కొత్త‌గా కంపెనీలు భాగ్య‌న‌గ‌రాన్ని ప్ర‌త్యేకంగా ఎంచుకుంటున్నాయి. భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎంతో ఆస‌క్తిని చూపుతున్నాయి. తాజాగా ఫ్రెంచ్ కు చెందిన బిగ్ సాఫ్రాన్ కంపెనీ(Safran CEO) తెలంగాణ‌లో ఇన్వెస్ట్ చేయ‌నుంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు మంత్రి కేటీఆర్(KTR). త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కంపెనీకి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు. హైద‌రాబాద్ లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్ఓ ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిపారు.

ఇదిలా ఉండ‌గా మ‌న న‌గ‌రంలో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే అతి పెద్ద‌ది అని స్ప‌ష్టం చేశారు మంత్రి కేటీఆర్.ఎంఆర్ఓ, ఇంజిన్ టెస్ట్ సెల్ కంపెనీ హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసేందుకు గాను రూ. 1,200 కోట్లు పెట్టుబ‌డిగా పెట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌బోయే ఈ కంపెనీ వ‌ల్ల 800 నుంచి 1000 మంది దాకా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని చెప్పారు కేటీఆర్.ఏరో స్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైద‌రాబాద్ మార బోతోంద‌ని కేటీఆర్(KTR Safran CEO) ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Also Read : ప‌టేల్ వ‌ల్లే నిజాం పాల‌న‌కు విముక్తి – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!