Rishi Sunak : బ్రిటన్ పీఎం రేసులో రిషి సునక్
అత్యధికంగా ఎన్నారైకే మద్దతు
Rishi Sunak : బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. దీనికి తెర దించుతూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ప్రధాన మంత్రి బోరీస్ జాన్సన్ గురువారం తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
అయితే తదుపరి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేంత వరకు జాన్సన్ ఆపద్దర్మ ప్రధానిగా కొనసాగుతారు. దీంతో ఎవరు ప్రధానమంత్రి అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రధానంగా ఒకే ఒక్కడి పేరు వినిపిస్తోంది. అతడే ప్రవాస భారతీయుడైన రిషి సునక్(Rishi Sunak) . తన క్యాబినెట్ లో బోరీస్ జాన్సన్ 42 ఏళ్ల రిషి సునక్ ను ఎంపిక చేశారు.
గత ఫిబ్రవరి 2020లో కొలువు తీరారు మంత్రిగా. ప్రస్తుతం యుకె ప్రధాని పదవికి ప్రధాన పోటీదారుడిగా ఉన్నారు రిషి సునక్. అదే గనుక జరిగితే బ్రిటన్ కు ప్రధాన మంత్రి అయిన మొదటి భారతీయ సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు.
కరోనా సమయంలో వ్యాపారులు, కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. మాజీ డిఫెన్స్ సెక్రటరీ పెన్నీ మోర్టాంట్ తో కలిసి 10 బిలియన్ల పౌండ్ల విలువైన భారీ ప్యాకేజీ ప్రకటంచాడు.
దీంతో రిషి సునక్(Rishi Sunak) బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆయన యుస్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా. ఇదే సమయంలో కోవిడ్ సమయంలో లాక్ డౌన్ ను ధిక్కరించినందుకు , డౌనింగ్ స్ట్రీట్ సమావేశంలో పాల్గొన్నందుకు జరిమానా కూడా విధించారు.
రిషి సునక్ పూర్వీకులు పంజాబ్ నుండి వచ్చారు. అంతే కాదు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్. ఆర్. నారయాణ మూర్తి కూతురు అక్షతా మూర్తితో సంబంధం ఉంది. రిషి సునక కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
Also Read : పీఎం పదవి వదులు కోవడం బాధాకరం