Shiv Sena MP’S : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో శివ‌సేన ఎంపీలు ఎటు వైపు

సీఎం షిండేనా ఉద్ద‌వ్ ఠాక్రేనా

Shiv Sena MP’S : మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన పార్టీ ఇప్పుడు సంక‌ట స్థితిని ఎదుర్కొంటోంది. కార్య‌క‌ర్త స్థాయి నుంచి ఉన్న‌త ప‌ద‌వి సీఎంగా కొలువు తీరేంత దాకా ఉన్న ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగుర వేశారు.

ఈ నేప‌థ్యంలో త‌న కొడుకు కూడా శివ‌సేన పార్టీ గుర్తు పైనే ఎంపీగా(Shiv Sena MP’S)  గెలుపొందారు. ఉద్ద‌వ్ ఠాక్రే సార‌థ్యంలోని శివ‌సేన పార్టీ ప్ర‌తిప‌క్షాలు క‌లిసి ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హాను బ‌రిలో నిలిపాయి.

ఈ విప‌క్షాల టీంలో శివ‌సేన కూడా ఉంది. దీంతో ధిక్కార స్వ‌రం వినిపించి కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే వ‌ర్గం వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

వారికి భార‌తీయ జ‌న‌తా పార్టీ వెనుక నుంచి మ‌ద్ద‌తు ఇస్తోంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న శివ‌సేన ఎంపీల‌లో ఎవ‌రు షిండే వైపు ఉంటారు. మ‌రెవ‌రు ఉద్ద‌వ్ ఠాక్రై వైపు నిల‌బ‌డ‌తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

ఒక వేళ తిరుగుబాటు జెండా ఎగుర వేస్తే వాళ్లు త‌ప్ప‌క త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆ పార్టీకి చెందిన అర‌వింద్ సావంత్ స్ప‌ష్టం చేశారు.

ఇదే విష‌యంపై స్పందించాడు. ఏక్ నాథ్ షిండే కొడుకు త‌న తండ్రి వైపు ఉంటాడా లేక ఉద్ద‌వ్ ఠాక్రే వైపు నిల‌బ‌డతాడా అనేది ఈనెల 18న జ‌రిగే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తేలుతుంద‌న్నాడు.

కాగా లోక్ స‌భ‌లో కొత్త చీఫ్ విప్ ఎంపిక‌ను శివ‌సేన‌కు చెందిన సావంత్ తిర‌స్క‌రించారు.

Also Read : అన‌వ‌స‌ర రాద్ధాంతం మ‌హూవా ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!