JP Nadda : బీజేపీ ఎంపీలంతా ఢిల్లీకి చేరుకోవాలి
రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆదేశం
JP Nadda : భారతీయ జనతా పార్టీ ఈనెల 18న జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ ఆదివాసీ గిరిజన తెగకు చెందిన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇచ్చింది.
ఇదే సమయంలో దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులకు రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర సర్కార్. కేరళకు చెందిన పరుగుల రాణి పి.టి.ఉష, కర్ణాటకకు చెందిన సంస్కర, ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే, ఏపీకి చెందిన కే.వి.విజయేంద్ర ప్రసాద్ , తమిళనాడకు చెందిన సంగీత దిగ్గజం ఇళయరాజాకు అవకాశం ఇచ్చింది.
ఈ తరుణంలో ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టికి చెందిన దేశంలోని ఎంపీలంతా ఈనెల 16 వరకు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకోవాలని స్పష్టం చేసింది.
వైసీపీ, బీజేడీ, మరికొన్ని పార్టీల మద్దతుతో ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలవాలంటే ఇంకా 8 వేలకు పైగా ఓట్లు కావాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలో నిలిపింది. ఎన్సీపీ, శివసేన, ఎంఐఎం, టీఆర్ఎస్, డీఎంకే, టీఎంసీ, తదితర పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
ఈ మేరకు బీజేపీ ఎంపీలంతా విధిగా హాజరు కావాలని ఆదేశించింది. 18 వరకు ఇక్కడే ఉండాలని సూచించింది.
ఈ రెండు రోజుల సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఎలా ఓటు వేయాలనే దానిపై శిక్షణ , ప్రదర్శన సెషన్ ను నిర్వహించనున్నట్లు పార్టీ చీఫ్ జేపీ నడ్డా(JP Nadda) వెల్లడించినట్లు సమాచారం.
అదే రోజు పార్టీ ఎంపీలందరికీ నడ్డా విందు కూడా ఇస్తారని టాక్.
Also Read : ముంబై మాజీ పోలీస్ చీఫ్ పై సీబీఐ కేసు