Devendra Fadnavis : దేశ ఆర్థిక రంగానికి మ‌రాఠా చోద‌క శక్తి

2030 నాటికి ట్రిలియ‌న్ డాల‌ర్లకు చేరుకోవాలి

Devendra Fadnavis : మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్(Devendra Fadnavis) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. భార‌త దేశానికి రెండో రాజ‌ధానిగా ముంబై ఉంద‌ని, ఆ దిశ‌గా త‌మ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా స‌రే ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని చెప్పారు. శుక్ర‌వారం జ‌రిగిన స‌మావేశంలో దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌ర త‌రాలుగా ముంబై దేశానికి చోద‌క శ‌క్తిగా ఉంటూ వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌నం ఒక దేశంగా పురోగ‌మిస్తూనే ఉంటే మనం 7 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార‌వ‌చ్చ‌న్నారు.

2030 నాటికి ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎద‌గాల‌ని 2015లో తాము ప్ర‌తిజ్ఞ చేశామ‌ని చెప్పారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్. మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే నాయ‌క‌త్వంలో మ‌రోసారి ప్ర‌తిజ్ఞ చేస్తున్నాన‌ని పేర్కొన్నారు.

వ్యాపార‌, వాణిజ్య ప‌రంగా రాష్ట్రాన్ని మ‌రింత ముందుకు తీసుకు వెళ‌తామ‌ని అన్నారు ఫ‌డ్న‌వీస్. గ‌తంలో ప్ర‌భుత్వాలు ఆర్థిక రంగం బ‌లోపేతానికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాలు లేవ‌న్నారు.

కానీ షిండే, బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ఆర్థిక రంగం బ‌లోపేతానికి రూట్ మ్యాప్ కూడా త‌యారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. త‌మ‌కు ఇప్ప‌టికే ఓ విజ‌న్ అంటూ ఉంద‌ని, ఆ దిశ‌గా తాము అడుగులు వేస్తున్నామ‌ని వెల్ల‌డించారు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్(Devendra Fadnavis).

అన్ని రంగాల‌లో మ‌రాఠాను దేశంలోనే టాప్ లెవ‌ల్లో తీసుకు వెళ్లేందుకు శ్ర‌మిస్తామ‌ని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. రాబోయే రోజుల్లో కొత్త మ‌హారాష్ట్ర‌ను ప్ర‌జ‌లు చూస్తార‌ని జోష్యం చెప్పారు.

Also Read : బీజేపీ ఎంపీలంతా ఢిల్లీకి చేరుకోవాలి

Leave A Reply

Your Email Id will not be published!