Uddhav Thackeray : శివ‌సేన శాశ్వ‌తం అజ‌రామ‌రం – ఠాక్రే

పార్టీ గుర్తింపును ఎవ‌రూ మార్చ‌లేరు

Uddhav Thackeray : శివ‌సేన పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌రాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన పార్టీని ఎవ‌రూ స్వంతం చేసుకోలేర‌న్నారు.

పార్టీకి సంబంధించిన విల్లు, బాణం గుర్తు కేవ‌లం త‌మ‌కు మాత్ర‌మే స్వంత‌మ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే. భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలు క‌లిసి ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వ ముచ్చ‌ట మూడు నాళ్లేన‌ని పేర్కొన్నారు.

అప‌విత్ర పొత్తు ఎంతో కాలం సాగ‌ద‌ని, అది కొద్ది కాలం పాటే ఉంటుంద‌ని జోష్యం చెప్పారు. శ‌నివారం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) జాతీయ మీడియాతో మాట్లాడారు.

గ‌త కొన్ని రోజులుగా తిరుగుబాటు జెండా ఎగుర వేసి సీఎం పీఠంపై ఆసీనులైన ఏక్ నాథ్ షిండే త‌మ‌దే అస‌లైన శివ‌సేన పార్టీ అని చెప్ప‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.

ఇంకోసారి అలాంటి కామెంట్స్ చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఎవ‌రు బాలా సాహెబ్ కు వార‌సులో ప్ర‌జ‌లకు స్ప‌ష్టంగా తెలుస‌న్నారు.

కేవ‌లం ప‌ద‌వుల కోసం ఆశ‌ప‌డి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్ల‌కు మాట్లాడేందుకు నైతిక హ‌క్కు లేద‌ని స్ప‌ష్టం చేశారు ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray). శివ‌సేన ఎప్ప‌టికీ నిలిచే ఉంటుంద‌న్నారు.

దానిని ఎవ‌రూ చెర‌ప‌లేర‌న్నారు. కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌లు స్థాయికి మించి ఉంటున్నాయ‌ని కొంచెం త‌గ్గించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు ఉద్ద‌వ్ ఠాక్రే.

శివ‌సేన‌ను నాశ‌నం చేయాల‌ని అనుకున్న వాళ్లు కాల‌గ‌ర్భంలో క‌లిసి పోక తప్ప‌ద‌ని హెచ్చరించారు.

Also Read : శివ‌సేన అంతానికి బీజేపీ కుట్ర – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!