Heavy Rains HYD : భారీ వర్షం అ’భాగ్యనగరం’ అస్తవ్యస్తం
రోజంతా ఎడ తెరిపి లేకుండా వర్షాలు
Heavy Rains HYD : భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తింది. కుండ పోత వర్షం(Heavy Rains HYD) కారణంగా నగరం వణుకుతోంది. నైరుతి రుతుపవనాల దెబ్బకు ఎక్కడ చూసినా వర్షాలే. అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర లో వర్షాల తాకిడికి తల్లడిల్లుతున్నారు జనం.
ఇక నిన్నటి నుంచి నేటి దాకా కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇళ్లల్లోనే ఉండి పోయారు ప్రజలంతా. బయటకు రావాలంటే కష్టంగా మారింది.
హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలైన బంజారా హిల్స్ , జూబ్లీ హిల్స్ , సికింద్రాబాద్ , కంటోన్మెంట్ , మలక్ పేట, ఎల్బీ నగర్ , కొత్త పేట, చార్మినార్ , రాజేంద్ర నగర్ , నాగోల్ , బీఎన్ రెడ్డి నగర్, సంతోష్ నగర్ ,చాంద్రాయణ్ గుట్ట, వనస్థలిపురం, ఉప్పల్ , తదితర ప్రాంతాలన్నీ నీళ్లతో నిండి పోయాయి.
వర్షాల తాకిడికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ నీళ్లతో నిండి పోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇక ట్రాఫిక్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు వచ్చేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.
రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో నగరం సగం చీకట్లోనే ఉండి పోయింది.
ఇక శిథిలావస్థకు చేరుకున్న భవనాల చుట్టు పక్కన ఉన్న వారు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉన్నారు. ఇక చాలా ప్రాంతాలలో నిర్మాణాల కోసం గుంతలు తవ్వారు. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది.
Also Read : భారీ వర్షం ముంబై అతలాకుతలం