Sri Lanka Protesters : పారిపోయిన శ్రీ‌లంక ప్రెసిడెంట్

రాజ‌ప‌క్సె భ‌వ‌నంపై మూకుమ్మ‌డి దాడి

Sri Lanka Protesters : శ్రీ‌లంక‌లో సంక్షోభం స‌మిసి పోలేదు. కొత్త‌గా దేశ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ లేదు. దేశంలో ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకాయి.

ప్ర‌ధానంగా ఆహారం, ఆయిల్ కొర‌త తీవ్రంగా వేధిస్తోంది. ఇదే స‌మ‌యంలో ర‌ణిలె విక్ర‌మ‌సింఘేను ప్ర‌ధాన మంత్రిగా నియ‌మించినా ఆగ్ర‌హం చ‌ల్లార‌లేదు.

శ‌నివారం ఉద‌యం శ్రీ‌లంక‌కు చెందిన నిర‌స‌న‌కారులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. శ్రీ‌లంక(Sri Lanka Protesters)  చీఫ్ గోట‌బ‌య రాజ‌ప‌క్సె ఇంటిపై దాడికి పాల్ప‌డ్డారు. దీంతో ముందే గ్ర‌హించిన ప్రెసిడెంట్ పారి పోయిన‌ట్లు స‌మాచారం.

ప్రెసిడెంట్ ను ప్ర‌జ‌ల దాడ నుంచి ర‌క్షించేందుకు సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించింది సైన్యం. కోపంతో ఊగి పోతున్న జ‌నాగ్ర‌హాన్ని కంట్రోల్ చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు.

ఎంత‌కూ వినిపించుకోక పోవడంతో గాల్లోకి కాల్పులు జ‌రిపారు. భ‌వనాన్ని ఆక్ర‌మించ‌కుండా ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు సైనికులు.

ముందు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసిన ప్రెసిడెంట్ గోట‌బ‌య రాజ‌ప‌క్సె వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలిన వారు డిమాండ్ చేశారు.

దాడికి పాల్ప‌డేందుకు పెద్ద ఎత్తున దూసుకు రావ‌డంతో ప్రెసిడెంట్ ను దొడ్డి దారిన , భారీ బందోబ‌స్తు మ‌ధ్య సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు. ప‌రిస్థితి దారుణంగా ఉంది శ్రీ‌లంకలో(Sri Lanka Protesters) .

ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని స్థితి నెల‌కొంది. ఒక‌ప్పుడు క‌ట్టుదిట్ట‌మైన కాప‌లా ఉన్న నివాసంలోకి జ‌నాలు ప్ర‌వేశించ డాన్ని సిర‌స టీవీ ప్ర‌సారం చేసింది. శ్రీ‌లంక నెల‌నెలా ఆహారం, ఇంధ‌న కొర‌త‌, ద్రవ్యోల్బ‌ణాన్ని ఎదుర్కొంటోంది.

తాజా స‌మాచారం మేర‌కు రాజ భ‌వ‌నంలోకి ప్ర‌వేశించిన‌ట్లు తెలిసింది.

Also Read : బ్రిట‌న్ పీఎం రేసులో రిషి సున‌క్

Leave A Reply

Your Email Id will not be published!