S Jai Shankar : శ్రీ‌లంక సంక్షోభం భార‌త్ సాయం – జై శంక‌ర్

ద్వీప దేశం ఆర్థికంగా కోలుకోవాలి

S Jai Shankar : ఆర్థిక‌, ఆహార‌, ఆయిల్, విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది ద్వీప దేశం శ్రీ‌లంక‌. ఈ త‌రుణంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశపు అవ‌స‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని చైనా మోసం చేసింది. అప్పులు ఇచ్చి అడుక్కునే స్థాయికి తీసుకు వ‌చ్చింది.

దీంతో నెల‌ల త‌ర‌బ‌డి ఆ దేశంలో అనిశ్చితి నెల‌కొంది. వేలాది మంది రోడ్ల‌పైకి వ‌చ్చారు. ఆందోళ‌న బాట ప‌ట్టారు. చివ‌ర‌కు దేశ అధ్య‌క్షుడు గోట‌బోయ రాజ‌ప‌క్సే రాజ భ‌వ‌నంపై దాడికి దిగారు.

ఈ త‌రుణంలో ముందే దాడి చేస్తార‌ని క‌నుక్కొన్న ప్రెసిడెంట్ త‌న ఫ్యామిలీతో క‌లిసి వెనుక గుండా పారి పోయాడు. అక్క‌డి నుంచి ఆర్మీ క్యాంపులోకి వెళ్లి..అక్క‌డిక‌క్క‌డే ఓడ‌లో ఇత‌ర దేశాల‌కు పారి పోయిన‌ట్లు అక్క‌డి మీడియా వెల్ల‌డించింది.

ఈ త‌రుణంలో ఇప్ప‌టికే అధ్య‌క్షుడి భ‌వ‌నంతో పాటు ప్ర‌ధాన మంత్రి ర‌ణిలే విక్ర‌మ సింఘే నివాసానికి నిప్పు పెట్టారు. ఆయ‌న‌కు చెందిన వాహ‌నాలు ద‌గ్ధంం చేశారు.

ఇదే స‌మ‌యంలో తాత్కాలికంగా అధ్య‌క్షుడు, పీఎం కొలువు తీరేంత దాకా పీఎం గా ఉండ‌నున్నారు ర‌ణిలే. ఈ త‌రుణంలో ఆదుకునేందుకు ఐఎంఎఫ్ ఆలోచిస్తోంది.

ఇదే క్ర‌మంలో పొరుగునే ఉన్న భార‌త దేశం ఇప్ప‌టికే శ్రీ‌లంక‌కు ఇతోధికంగా సాయం చేసింది. ప్ర‌జ‌ల‌కు యూరియా, ఆయిల్, మందులు స‌ర‌ఫ‌రా చేసింది.

తాజాగా సంక్షోభంలో ఉన్న ఆ దేశానికి భార‌త్ సాయం చేస్తుంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్(S Jai Shankar). ఇదిలా ఉండ‌గా శ్రీ‌లంక‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న దేశాల‌లో ఇండియా టాప్ లో ఉంద‌న్నారు.

ఇప్ప‌టికే $3 బిలియ‌న్ల విలువైన సాయాన్ని అందించామ‌ని ఆదివారం మీడియాతో చెప్పారు.

Also Read : ప్లీజ్ సంయ‌మ‌నం పాటించండి

Leave A Reply

Your Email Id will not be published!