Aditya Thackeray : షిండేపై శివమెత్తిన ఆదిత్యా ఠాక్రే
తమపై కోపం ప్రజలకు శాపం
Aditya Thackeray : సీఎం ఏక్ నాథ్ షిండేపై సీఎం ఉద్దవ్ ఠాక్రే తనయుడు ఆదిత్యా ఠాక్రే(Aditya Thackeray) నిప్పులు చెరిగాడు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ముంబై మెట్రో లైన -3 కార్ షెడ్ కు వ్యతిరేకంఆ ఆరే కాలనీలో పర్యావరణవేత్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా ఆదిత్యా ఠాక్రే హాజరయ్యారు. వారికి మద్దతు పలికారు.
చెట్లను నరికేసి పర్యావరణానికి హాని కలిగించే ఈ ప్రాజెక్టును ఎలా చేపడతారంటూ ప్రశ్నించారు ఆదిత్యా ఠాక్రే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తమపై కోపం ఉన్నా పర్వా లేదు.
కానీ ఈ నగరాన్ని, ప్రజలను ఇబ్బందులకు గరి చేయడం మంచి పద్దతి కాదన్నారు. అడవులు, పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు ఆదిత్యా ఠాక్రే. వాతావరణ మార్పు మనపై ఉందని స్పష్టం చేశారు.
మెట్రో కార్ షెడ్ నిర్మాణం కాకుండా వెటర్నరీ ఆస్పత్రిగా మార్చాలని ప్రతిపాదించారు. గతంలో తాము పర్యావరణానికి హానీకరం అవుతుందనే ఉద్దేశంతోనే దానిని ఆపి వేశామన్నారు ఆదిత్యా ఠాక్రే. కానీ ఏక్ నాథ్ షిండే,
భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ మరోసారి తేనె తుట్టెను కదిలించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకోబోమని హెచ్చరించారు ఠాక్రే.
ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల తర్వాత మరాఠా సీఎం షిండే ఆరే కాలనీ నుండి ప్రతిపాదిత మెట్రో కార్ షెడ్ ను తరలించాలన్న ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తోసిపుచ్చారు.
Also Read : చక్రం తిప్పుతున్న ఏక్ నాథ్ షిండే