CM KCR : ముందస్తు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా – కేసీఆర్
బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి
CM KCR : సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు సిద్దమా అని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. ఆదివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరే తేదీ డిసైడ్ చేస్తే తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. దీంతో సీఎం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఇప్పటికే ముందస్తు వ్యూహంతో కేసీఆర్(CM KCR) ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ అదే విషయాన్ని ఆయన ప్రకటించడంతో రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఇదే సమయంలో కొందరు హద్దు పద్దు లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. ఆయన దాదాపు రెండు గంటలకు పైగా మాట్లాడారు.
ఆయన ప్రధానంగా కేంద్ర సర్కార్ పై , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. చివరగా ముందస్తు ఎన్నికల ప్రస్తావనను ప్రత్యేకంగా తీసుకు వచ్చారు.
మీకు దమ్ముంటే ఎన్నికలకు సిద్దం కావాలని తాను ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేస్తానని , ఎన్నికలకు పోదాం అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
దేశ వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా సీఎం(CM KCR) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో వైపు రాజకీయాలు మరింత వేడెక్కాయి.
ఈ తరుణంలో కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డేట్ మీరు చెబితే నేను డిసైడ్ చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పారు కేసీఆర్.
Also Read : కేంద్రంపై పోరాటం మోదీపై యుద్ధం