Medha Patkar : మేధా పాట్కర్ పై కేసు నమోదు
విరాళాలు ఇవ్వాలంటూ తప్పుదోవ
Medha Patkar : ప్రముఖ సామాజిక వేత్త, కార్యకర్త మేధా పాట్కర్ పై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోని నర్మదా లోయ ప్రజల సంక్షేమం కోసం మేధా పాట్కర్ , ఇతర ట్రస్టీలు తన ట్రస్ట్ కు ఇవ్వాలంటూ విరాళాలు ఇవ్వాలని ప్రజలను తప్పు దోవ పట్టించారంటూ ఆరోపించారు.
మధ్య ప్రదేశ్ లోని బర్వానీ జిల్లాలో మేధా పాట్కర్(Medha Patkar) తో పాటు మరో 12 మందిపై మోసం చేశారన్న ఆరోపణలపై ఆదివారం కేసు నమోదైంది.
మేధా పాట్కర్ , ఇతర ట్రస్టీలు మధ్య ప్రదేశ్ , మహారాష్ట్ర లోని నర్మదా లోయ ప్రజల కోసం ఆమె స్థాపించిన ట్రస్ట్ కు విరాళాలు ఇవ్వాలని తప్పు దోవ పట్టించారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
అంతే కాకుండా ఫిర్యాదుదారు చేసిన ఎఫ్ఐఆర్ లో ఆమె, ఇతర ట్రస్టీలు కూడ బెట్టిన సొమ్మును రాజకీయ, దేశ వ్యతిరేక ఎజెండా కోసం ఉపయోగించారంటూ ఆరోపించారు.
ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఒడిశా లోని జగత్ సింగ్ పూర్ జిల్లా లోని ధింకియా గ్రామంలో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టు పై నిరసన చెలరేగింది.
మేధా పాట్కర్ తో పాటు వందలా మంది పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆమె సందర్శించిన తర్వాత కేసు నమోదైంది మేధా పాట్కర్(Medha Patkar) పై . జైలులో ఉన్న నిరసనకారుల నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఆమెను అడ్డుకున్నారని పీటీఐ నివేదించింది.
దక్షిణా కొరియా ఉక్కు సంస్థ పోస్కోకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు. ధింకియాలో ఆమె ప్రవేశాన్ని అడ్డుకున్నారు గ్రామస్థులు.
Also Read : జయలలిత వారసుడు ఎవరో