CM KCR : కేంద్రంపై పోరాటం మోదీపై యుద్ధం

ఈ దేశానికి ప‌ట్టిన శ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ

CM KCR : గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా సీఎం కేసీఆర్ కేంద్ర స‌ర్కార్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆపై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మొత్తంగా త‌న స్టాండ్ ఏమిటో స్ప‌ష్టం చేశారు.

ద‌మ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలంటూ స‌వాల్ విసిరారు. ఆపై అసెంబ్లీని ర‌ద్దు చేసేందుకు రెడీగా

ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు కేసీఆర్.

నిన్న మొన్న‌టి దాకా కొంచం గౌర‌వంగా మాట్లాడుతూ వ‌చ్చిన సీఎం మాట‌ల తూటాలు పేల్చారు. ప్ర‌ధానంగా మోదీని ఏకి పారేశారు. ఈ

ఎనిమిదేళ్ల కాలంలో ఏం సాధించారో చెప్పాలంటూ నిల‌దీశారు.

మీ నిర్వాకం వ‌ల్ల స్విస్ బ్యాంకులో న‌ల్ల ధ‌నం మ‌రింత పెరిగింద‌ని, దీనికి మోదీనే కార‌ణ‌మంటూ మండిప‌డ్డారు. కులం, మ‌తం, ప్రాంతం పేరుతో మ‌నుషుల మ‌ధ్య విభేదాలు సృష్టించ‌డం, ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందడం బీజేపీకి ఒక అల‌వాటుగా మారింద‌న్నారు.

జ‌ల‌గ‌ల కంటే ఎక్కువ‌గా దేశాన్ని పీల్చి పిప్పి చేస్తోంద‌న్నారు. గ‌తంలో ఇందిరా గాంధీ నేరుగా ఎమ‌ర్జెన్సీ విధిస్తే ఇవాళ మోదీ కొలువు తీరాక

అప్ర‌క‌టిత ఎమ‌ర్జెన్సీ అమ‌ల‌వుతోంద‌న్నారు.

లక్ష‌ల కోట్ల బ్యాంకుల స్కాముల్లో మీ వాటా ఎంతో చెప్పాల‌ని డిమాండ్ చేశారు కేసీఆర్. విదేశీ బొగ్గు దిగుమ‌తి వెనుక జ‌రిగిన అవినీతి

ఏంటో బ‌య‌ట పెట్టాల‌న్నారు.

మోదీని గ‌ద్దె దించ‌డ‌మే త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించారు కేసీఆర్(CM KCR). మోదీ అస‌మ‌ర్థ పాల‌న వ‌ల్లే దేశం ఇవాళ ఇంత‌టి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంద‌న్నారు.

మేకిన్ ఇండియా అన్న‌ది ఓ ఫార్స్ అని కొట్టి పారేశారు. అర‌వ‌డం త‌ప్ప స‌రుకు అన్న‌ది మోదీలో లేద‌ని ఎద్దేవా చేశారు. గుప్పెడు మంది పెట్టుబ‌డిదారుల‌కు మోదీ సేల్స్ మెన్ గా ప‌ని చేస్తున్నాడంటూ ఆరోపించారు.

సుజ‌నా చౌద‌రి, సువేందు అధికారి, ముకుల్ రాయ్, సీఎం ర‌మేష్ , జ్యోతిరాదిత్యా సింధియా, త‌దిత‌రుల‌కు నోటీసులు ఇవ్వ‌డం

ఆపై చేర్చుకోవ‌డం బీజేపీకే చెల్లింద‌న్నారు.

Also Read : కాషాయం దేశానికి ప్ర‌మాదం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!