Dinesh Gundu Rao : మైఖేల్ లోబోను తొలగించిన కాంగ్రెస్
పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని ఆరోపణ
Dinesh Gundu Rao : గోవా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు అసెంబ్లీలో తమ పార్టీ నాయకుడు మైఖేల్ లోబోను(Michael Lobo) తొలగించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు పార్టీ రాష్ట్ర ఇం ఛార్జ్ గుండూరావు.
గోవాలో కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు బీజేపీతో పాటు కొందరు నాయకులు కుట్ర పన్నారంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా మైఖేల్ లోబోతో సహా ఐదుగురు కాంగ్రెస పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సీఎం ఇంటి వద్ద ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ తరుణంలో గుండూ రావు చేసిన ప్రకటన కలకలం రేపింది. అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ లోకి వెళ్లారనే వార్తలను రోజంతా కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది.
కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకుడు మైఖేల్ లోబోను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీని బలహీన పరిచేందుకు కుట్ర పన్నారంటూ ఆరోపించారు గుండూరావు.
బీజేపీతో కలిసి మా పార్టీకి చెందిన కొందరు కుట్ర పన్నారు. ఈ కుట్రకు ఇద్దరు నాయకులు సారథ్యం వహించారు. వారిలో మైఖేల్ లోబో, దిగంబర్ కామ్ నాయకత్వం వహించారంటూ గోవా రాష్ట్ర పార్టీ ఇన్ చార్జి దినేశ్ గుండూరావు(Dinesh Gundu Rao) చెప్పారు.
ప్రధానంగా దిగంబర్ కామ్ పై ఎన్నో కేసులు ఉన్నాయి. ఆయన తనను తాను కాపాడుకునేందుకు ఇలా చేశాడంటూ ఆరోపించారు. అధికారం కోసం బీజేపీ అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు గుండూ రావు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు గోవా వెళ్లాలని పార్టీ సీనియర్ నాయకుడు ముకుల్ వాస్నిక్ ను కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ఆదేశించారు.
ఇక సీఎం ఇంటికి వెళ్లిన వారిలో మైఖేల్ లోబో, డెలిలా లోబో, దిగంబర్ కామత్ , కేదార్ నాయక్ , రాజేష్ ఫల్డే సాయి ఉన్నారు.
Also Read : మేధా పాట్కర్ పై కేసు నమోదు