India Population : 2023లో చైనాను దాటనున్న భారత్ జనాభా
సంచలన నివేదిక వెల్లడించిన యుఎన్
India Population : ఇప్పటికే జనాభాతో నానా తంటాలు పడుతున్న భారత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది యుఎన్. 2023లో ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా కలిగిన దేశంగా చైనాను భారత్ అధిగమించే అవకాశం ఉందని పేర్కొంది.
భారత దేశం 2050లో 1.668 బిలియన్ల జనాభాను(India Population) కలిగి ఉంటుందని అంచనా వేసింది. 2022 నవంబర్ నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుతుందని ఐక్య రాజ్య సమితి వెల్లడించింది.
సోమవారం తన వార్షిక నివేదికను విడుదల చేసింది. వచ్చే ఏడాదిలోనే చైనాను భారత్ దాటేస్తుందని పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ , పాపులేషన్ డివిజన్ ఈ మేరకు ఈ నివేదిక తయారు చేసింది.
ఈ ఏడాది నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉండగా వరల్డ్ పాపులేషన్ 1950 నుండి నెమ్మదిగా పెరుగుతోందని, 2020లో ఒక శాతం కంటే తక్కువకు పడి పోయిందని పేర్కొంది.
ఐక్య రాజ్య సమితి తాజా అంచనాల ప్రకారం ప్రపంచ జనాభా 2030లో దాదాపు 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు పెరగవచ్చని హెచ్చరించింది.
అంతే కాకుండా 2080లో సుమారు 10.4 బిలియన్ల మందికి చేరుకోవచ్చని తెలిపింది. జనాభాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ .
మెరుగు పడిన ఆరోగ్య వసతి సౌకర్యాలు, బలవంతమైన పౌష్టిక ఆహారం అందుబాటులోకి రావడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు సెక్రటరీ జనరల్.
Also Read : శ్రీలంక సంక్షోభం భారత్ సాయం – జై శంకర్