EPS AIADMK BOSS : అన్నాడీఎంకేకు ఈపీఎస్ బాస్
ఓపీఎస్ పార్టీ నుంచి బహిష్కరణ
EPS AIADMK BOSS : గత కొంత కాలంగా మిత్రులుగా ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఇప్పుడు బద్ద వైరులుగా మారారు. తమిళనాడు రాష్ట్రంలో అయితే అన్నాడీఎంకే లేదంటే డీఎంకే పవర్ లోకి వచ్చేంది.
ఈసారి జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ సంకీర్ణ సర్కార్ కూలి పోయింది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పవర్ లోకి వచ్చింది. ఇక అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు మాజీ సీఎం ఎడాప్పొడి పళని స్వామి(EPS AIADMK BOSS),
మాజీ డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం. ఆ ఇద్దరూ మొన్నటి దాకా బాగానే ఉన్నారు. కానీ అన్నాడీఎంకే పార్టీ తమ చేతుల్లోకి తీసుకోవాలన్నది ఈపీఎస్, ఓపీఎస్ మధ్య ఆధిపత్య పోరుకు దారి తీసింది.
ఇరు నాయకుల మద్దతుదారుల మధ్య పోట్లాటకు దారి తీసింది. చివరకు ఆ ఇద్దరు కలిసి తమకు అడ్డు రాకుండా దివంగత సీఎం కుమారి జయలలిత నెచ్చెలిగా భావించే వీకే శశికళను బయటకు పంపించారు.
తీరా ఇద్దరి మధ్య ఏం ముదిరిందో కానీ వైరం మొదలైంది. చివరకు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకునేంత దాకా వెళ్లింది. ఇవాళ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
ఇది జరిగేందుకు వీలు లేదంటూ ఓపీఎస్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం తుది తీర్పు వెలువరించింది. పన్నీర్ సెల్వంకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. బేషరత్తుగా ఎన్నికలు చేపట్టవచ్చంటూ పేర్కొంది.
దీంతో అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈపీఎస్ ఏఐడీఎంకే బాధ్యతలు చేపట్టడంతో ఓపీఎస్ పార్టీ అన్ని పదవుల నుంచి బహిష్కరణకు గురయ్యారు.
Also Read : పన్నీర్ సెల్వంకు కోర్టు బిగ్ షాక్