PM Modi : జాతీయ చిహ్నం నైపుణ్యం అద్బుతం – మోదీ

ఆవిష్క‌రించిన ప్ర‌ధాన మంత్రి

PM Modi : కొత్త‌గా నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నం పైక‌ప్పుపై వేసిన జాతీయ చిహ్నాన్ని సోమ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi)  ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా దీనిని అద్భుతంగా, నైపుణ్యంతో త‌యారు చేసిన శ్రామికుల‌ను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ చిహ్నం 9,500 కిలోల బ‌రువు, 6.5 మీట‌ర్ల ఎత్తులో దీనిని కాంస్యంతో త‌యారు చేశారు. చూసేందుకే కాదు అద్భుత‌మైన ప‌నితీరుకు ఇది నిద‌ర్శ‌నంగా, కొల‌మానంగా నిలిచి పోతుంద‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన మంత్రి మోదీ.

ఈ ఏడాది చివ‌ర్లో కొత్త భ‌వ‌నం షెడ్యూల్ ప్రారంభానికి ముందు మొద‌టి ప్ర‌ధాన మైలు రాయిని సూచిస్తుంద‌న్నారు. ఇదిలా ఉండ‌గా పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ఇక్క‌డే జ‌రుగుతాయ‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం సెంట్రల్ ఫోయ‌ర్ పై భాగంలో ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దానికి మ‌ద్ద‌తుగా 6,500 కిలోల బ‌రువున్న స్టీల్ ను వాడారు.

జాతీయ చిహ్నం కాన్సెప్ట్ స్కెచ్, కాస్టింగ్ ప్ర‌క్రియ క్లే మోడ‌లింగ్ , కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ , పాలిషింగ్ దాకా ఎనిమిది వేర్వేరు ద‌శ‌ల తయారీలో సాగింది.

ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీతో(PM Modi)  పాటు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్, కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖా మంత్రి హ‌ర్దీప్ సింగ్ పాల్గొన్నారు.

ఇదే స్థ‌లంలో జ‌రిగిన మ‌త ప‌ర‌మైన వేడుక‌కు కూడా ప్ర‌ధాన మంత్రి హాజ‌రయ్యారు. భ‌వ‌న నిర్మాణంలో నిమగ్న‌మైన కార్మికుల‌తో మోదీ సంభాషించారు. త‌మ ప‌ని ప‌ట్ల వారు గ‌ర్వ ప‌డాల‌ని అన్నారు. దేశం గ‌ర్వించేలా నిమ‌గ్నం కావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

Also Read : శ్రీ‌లంకకు సైన్యాన్ని పంప‌లేదు – భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!