Ajoy Kumar : రాష్ట్రపతి కోసం బీజేపీ ఆదివాసీ జపం
ఇదంతా రాజకీయ అవకాశవాదమే
Ajoy Kumar : కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కేవలం తన రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకే ఆదివాసీ జపం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయంగా లబ్ది పొందేందుకే తప్ప ఆదివాసీల గురించి మాత్రం కాదన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు అజోయ్ కుమార్(Ajoy Kumar).
ఈ దేశంలో బీజేపీ వచ్చాక అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలు, తెగల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రపతిగా ఎంపిక చేయడం వల్ల ఎంత మంది జీవితాలు బాగు పడతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి దానినీ తెగలు, జాతులు, కులాలు, ప్రాంతాలు, మతాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు.
దుర్మార్గ పూరితమైన తత్వాన్ని ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో గవర్నర్ గా కొలువు తీరిన సమయంలో కానీ లేదా ఒడిశాలో మంత్రిగా ఉన్న సమయంలో కానీ ఆమె ఆదివాసీ జాతులు, తెగలకు ఎలాంటి న్యాయం చేసిందో చెప్పాలన్నారు.
ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. 21న ఫలితాలు ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. ఇదిలా ఉండగా విపక్షాల తరపున అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ఎంపిక చేసింది.
ఆమె ఇప్పుడు ఆదివాసీ జాతికి చిహ్నం కాదంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు. కాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కాంగ్రెస్ నేత చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
Also Read : ప్రధాని మోదీపై టీఎంసీ ఆగ్రహం