Rishi Sunak & Penny Mordaunt : తొలి రౌండ్ లో రిషి సునక్ దే హవా
గట్టి పోటీ ఇస్తున్న పెన్నీ మోర్డంట్
Rishi Sunak & Penny Mordaunt : ప్రవాస భారతీయుడు, ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తి అల్లుడైన రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు.
మొదటి రౌండ్ ముగిసే సరికి 42 ఏళ్ల రిషి సునక్(Rishi Sunak) 88 మంది కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీల ఓట్లను సాధించారు. మరో వైపు పీఎం
రేసులో గట్టి పోటీ ఇస్తున్నారు పెన్నీ మోర్డంట్.
ఆమెకు ఊహించని రీతిలో 67 ఓట్ల మద్దతును కూడగట్టారు. రిషి సునక్ , పెన్నీ మార్డంట్(Penny Mordaunt) మధ్య కేవలం 21 ఓట్ల తేడా మాత్రమే.
ఇక ప్రధాన మంత్రి పదవి రేసులో పెన్నీతో పాటు చివరి దాకా గట్టి పోటీ ఇస్తూ వచ్చారు 49 ఏళ్ల లిజ్ ట్రస్.
ఆమెకు 50 ఓట్లు దక్కాయి. కేమీ బదెనోక్ కు 40 ఓట్లు పోల్ అయ్యాయి. ఇదే తొలి రౌండ్ లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి అటార్నీ జనరల్ గా పని చేస్తున్న జనరల్ సుయెల్లా బ్రేవర్మన్ కూడా మెరుగైన ఓట్లను సాధించాడు.
అతడికి 32 ఓట్లు వచ్చాయి. ఇదే క్రమంలో తాము కూడా పీఎం రేసులో ఉన్నామంటూ ప్రధాన మంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ మంత్రి పదవికి రాజీనామా ప్రకటించిన పాకిస్తాన్ కు చెందిన నదీం జహావీ, జెరమీ హంట్ తొలి రౌండ్ లో వైదొలిగారు.
ఈ ఇద్దరు పోటీ నుంచి తప్పు కోవడంతో బరిలో ఆరుగురు అభ్యర్థులు మిగిలారు. అయితే పీఎం రేసులో మరింత దూకుడు పెంచిన రిషి సునక్ కు
గట్టి పోటీ ఎదురవుతోంది తన పార్టీకి చెందిన పెన్నీ (Rishi Sunak & Penny Mordaunt)నుంచి.
ఈనెల 21 వరకు ఇద్దరు మాత్రమే చివరకు ఉంటారు. వారిలో 2 లక్షల మంది కన్జర్వేటివ్ సభ్యులు ఎవరికి మద్దతు ఇస్తే వారే సెప్టెంబర్ 5న
ప్రధాన మంత్రి పదవిని అధీష్టిస్తారు.
Also Read : పెన్నీ మోర్డాంట్ గేమ్ ఛేంజర్ కానుందా