Narayan Tripathi : స్వంత పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

స్వ‌లాభం కోసం ప్ర‌భుత్వ యంత్రాంగం

Narayan Tripathi : మ‌ధ్య‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరిగారు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే నారాయ‌ణ్ త్రిపాఠి. జూలై 2019లో విధాన స‌భ‌లో బిల్లుపై అప్ప‌టి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఓటు వేసిన ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేల‌లో ఆయ‌న కూడా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా నారాయ‌ణ్ త్రిపాఠి(Narayan Tripathi) మ‌ధ్య ప్ర‌దేశ్ లోని మైహ‌ర్ (సత్నా) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ప‌ట్టుంది. తాజాగా త‌న పార్టీపైనే సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

త‌న స్వంత పార్టీ మొత్తం ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని స్వ‌లాభం కోసం వాడుకుంటోందంటూ మండిప‌డ్డారు. జ్యోతిరాదిత్య సింధియా , అత‌ని విధేయుల నిష్క్ర‌మ‌ణ త‌ర్వాత క‌మ‌ల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస ప్ర‌భుత్వం కూలి పోయింది.

దీంతో 2020లో అధికారంలోకి వ‌చ్చింది శివ‌రాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం. అయితే నారాయ‌ణ్ త్రిపాఠి(Narayan Tripathi) చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌కు దారి తీశాయి.

నేను బీజేపీకి వ్య‌తిరేకం కాదు. కానీ జ‌రుగుతోంది మాత్రం త‌న‌కు బాధ క‌లిగిస్తోంద‌న్నారు. తాను మైహార్ లో ప‌ర్య‌టిస్తూ ఉన్నా. ప‌ట్వారీ స్థాయి నుండి పై స్థాయి వ‌ర‌కు ఉన్న అధికారి ఎవ‌రైనా ఫ‌లానా పార్టీ కోసం ప్ర‌చారం చేయ‌డం క‌నిపించింద‌న్నారు.

అధికారులు పూర్తిగా ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయ‌డం మానేశారు. కేవ‌లం బీజేపీకి ఓట్లు దండుకునే ప‌నిలో ప‌డ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నాన‌నే బాధ క‌లుగుతోంద‌న్నారు. ఈ దేశంలో 2 నిమిషాల్లో ప్ర‌భుత్వాన్ని కూల్చ‌వ‌చ్చాన్న‌రు.

Also Read : రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైతే సీఏఏని అడ్డుకుంటా

Leave A Reply

Your Email Id will not be published!