Microsoft : మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాల కోత
కొత్త నియామకాలు కష్టమే
Microsoft : ఐటీలో కష్ట కాలం మొదలైంది. ఈ మేరకు ఇప్పటికే గూగుల్ తాజాగా ఫ్రెషర్స్ ను తీసుకోవడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పింది. తాజాగా మైక్రో సాఫ్ట్ సైతం అదే బాటలో నడిచింది.
స్ట్రక్చరల్ అడ్జస్ట్ మెంట్ లో ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీని వల్ల ఏర్పడే ఖాళీలలో అవసరమైతే భర్తీ చేస్తామని లేదంటే కష్టమేనని పేర్కొంది మైక్రో సాఫ్ట్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని పెరిగిన హెడ్ కౌంట్ తో ముగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం మైక్రో సాఫ్ట్(Microsoft) కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,80,000 వేల మందికి పైగా పని చేస్తున్నారు వివిధ విభాగాలలో. ఒక శాతం మేరకు తగ్గించినా భారీగా ఉద్యోగాలు కోల్పోతారు.
గత నెల జూన్ 30న తన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వ్యాపార సమూహాలు, పాత్రలను పునః సమీక్షించింది మైక్రోసాఫ్ట్. దీంతో కంపెనీ భవిష్యత్తు అవసరాల మేరకు సోమవారం కొన్ని ఉద్యోగాలను తగ్గించింది.
ఈ మేరకు సిఇఓ, చైర్మన్ పేరుతో ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇతర వాటిలో ఖాళీల భర్తీకి సంబంధించి నియామకాలు జరపాలని నిర్ణయించింది.
అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని పెరిగిన ఉద్యోగుల సంఖ్యతో ముగించాలని యోచిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్(Microsoft) తెలిపింది. కన్సల్టింగ్, కస్టమర్, పార్టనర్ సొల్యూషన్ లతో సహా అనేక విభాగాలు ప్రస్తుతం కంపెనీలో కొలువు తీరి ఉన్నాయి.
ఈ విషయాన్ని మైక్రో సాఫ్ట్ తన అధికారిక కంపెనీ ఈ మెయిల్ లో వెల్లడించింది.
Also Read : ఐటీ ఫ్రెషర్స్ కు గూగుల్ బిగ్ షాక్